Site icon HashtagU Telugu

Mutton Offering To Ganesha: ఇదేం చోద్యం.. అక్కడ వినాయకుడికి మటన్, చికెన్‌ నైవేద్యం.. ఎక్కడంటే..?

Mutton Offering To Ganesha

Ganesh

Mutton Offering To Ganesha: అదేంటీ విజ్ఞాలు తొలగించే వినాయకుడికి ఎంతో నిష్టతో ఉండ్రాళ్ల పాయసం, పండ్లూ ఫలాలు, పులిహోర నైవేద్యంగా పెడతారు. చికెన్, మటన్, చేపలతో పూజ చేయడం (Mutton Offering To Ganesha) అపచారం అని అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం అక్కడ ఇలాగే పూజిస్తారు. తరతరాలుగా తమ ఆచారారం అంటున్నారు. ఇంతకీ ఈ తంతు ఎక్కడో తెలుసా..! ఉత్తర కర్ణాటకలో ప్రతి సంవత్సరం వినాయకుడి పూజలో అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, చేపలు, చికెన్ నైవేద్యంగా పెడతారట. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. రకరకాల నాన్‌ వెజ్‌ వంటకాలను నైవేద్యంగా పెడుతుంటారు. తరతరాలుగా ప్రతి ఏటా కొన్ని కుటుంబాలు కలిసి ఇలా మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది.

నెల రోజులు వెయిటింగ్‌

నాన్‌వెజ్‌ ప్రియులు ఇలి వీక్‌ కోసమే నెల రోజులు వెయిట్‌ చేస్తారు. ఉత్తర ప్రజలు భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. శ్రావణ నుంచి గణేశ్‌ చతుర్థి వరకు నాన్‌ వెజ్‌ ముట్టుకోరు. నానవెజ్‌ డైట్‌ను ఎలుకల వారంతో మళ్లీ ప్రారంభిస్తారు. మొదటి రోజు కడుబు, మోదక మొదలైన మధురమైన ఆహారాన్ని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా సమర్పిస్తారు.

Also Read: Sign Languages Day : భాష రాకున్నా భావం భళా.. ఇవాళ సంకేత భాషా దినోత్సవం

రెండో రోజు ఎలుకకు పూజలు

రెండో రోజు గణపతి మూషికానికి ప్రాధాన్యత లభిస్తుంది. ఎలుకలు సాధారణంగా ఇంట్లో పెరిగే మొక్కలకు చాలా హాని చేస్తాయి. ఈ విధంగా ఎలుకను పూజించడం ద్వారా అది చాలా హాని కలిగించదని ప్రార్థనలు చేస్తారు. సావాజీ కమ్యూనిటీకి చెందిన చాలా ఇళ్లలో ఈ ఆచారం ప్రబలంగా ఉంది.

మటన్‌ వంటకాలకు ప్రాధాన్యం

నాన్‌ వెజ్‌ నైవేద్యంలో కూడా మటన్‌ వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మటన్‌ మసాలా, మటన్‌ బోటీ, మటన్‌ ఖీమా తదితర వంటకాలను అందిస్తారు. అలాగే కొంతమంది చేపలు, చికెన్‌ కూడా అందిస్తారు. చేపలలో మూరంగి చేప ముషాక్‌కు ఇష్టమైనదిగా చెబుతారు. కనుక దీనిని ఆహార రూపంలో తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. రోటీ, ఎడ్మి మొదలైన వంటకాలను కూడా అందిస్తారు. ఈ విశిష్టమైన ఆచారం ఎప్పుడు మొదలైందో తెలియదు. అయితే వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు బంధువులను కూడా ఆహ్వానిస్తారు. తాజాగా దీనికి సంబంధించి వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏది ఏమైనా ఎంతో నియమ నిష్టలతో పూజించే వినాయకుడికి ఇలా పూజించడం ఏంటీ అని భక్తలు నివ్వెరపోతున్నారు.