కేరళలో అత్యధిక ఆత్మహత్యలు జరిగిన నగరం అదే…?

కేరళలో 2020 సంవత్సరంలో 8,500 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ మరణాలు అత్యధికంగా కొల్లాం నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.

  • Written By:
  • Publish Date - November 8, 2021 / 04:16 PM IST

కేరళలో 2020 సంవత్సరంలో 8,500 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ మరణాలు అత్యధికంగా కొల్లాం నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది. పురుషులు 6,750 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, మహిళలు 1930 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వ్యాప్తి సయయంలో లాక్ డౌన్ ఆంక్షలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించాయి. ఈ సమయంలో 24 శాతం ఆత్మ
హత్యల రేటుతో కేరళ దేశంలో ఐదవ స్థానంలో నిలిచింది. కొల్లాం నగరంలో 2019లో 457 మంది ఆత్మహత్య చేసుకోగా…2020లో 488 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం కొల్లం నగరంలో ఆత్మహత్యల రేటు 44గా ఉంది.

కేరళ రాష్ట్రంలో నిరుద్యోగులు 1,769 ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ రేటు మరింత పెరిగింది. మొత్తం ఇటువంటి కేసులలో ఈ సంఖ్య 11.3 శాతంగా ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర తర్వాత కేరళ రెండవ స్థానానికి చేరుకుంది. 2020 వ
సంవత్సరంలో లాక్ డౌన్ కాలంలో 2,496 మంది రోజువారీ కూలీ పనులు చేసుకునే వారు ఆత్మహత్యలు చేసుకన్నారు. 893 మంది స్వయం ఉపాధి వ్యక్తులు, 448 మంది చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా ఆత్మహత్య చేసుకుని మరణించారు. గత ఏడాది 796 మంది రైతులు,వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు.వీరితో పాటు గృహిణులు 908 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 803 మంది జీతాలు వచ్చే వారు, 593 మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా గత ఏడాదిలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అత్యధిక ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది.

ఇలాంటి సమస్యలతో 3,575 మంది ఆత్మహత్యలు చేసుకోగా, వివిధ వ్యాధులతో బాధపడుతూ 1,933 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల 692 మంది, దీర్ఘకాలిక వ్యాధులు వల్ల 688 మంది,మానసిక అనారోగ్యం వల్ల 997 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు నివేదికలో తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న వారిలో 3,150 మంది పదోతరగతి వరకు చదువుతుండగా, 1,603 మంది 12వ తరగతి వరకు చదువుకున్నారు.

ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా

మొత్తం ఆత్మహత్యలు: 8,500.
పురుషులు: 6,570.
స్త్రీలు: 1,930.
ఆత్మహత్యల రేటు – 24 (ఒక లక్ష జనాభాకు), భారతదేశంలో ఐదవది.
నిరుద్యోగుల ఆత్మహత్య: 1,769, భారతదేశంలో రెండవది.

కారణాలు
కుటుంబ సమస్యలు: 3,575.
అనారోగ్యం: 1,933.
రుణం: 180.
నిరుద్యోగం: 122.
ప్రేమ వ్యవహారం: 238.
మానసిక అనారోగ్యం: 997.
దీర్ఘకాలిక వ్యాధులు: 688.
డ్రగ్ కి బానిసై : 692.
క్యాన్సర్ 213.
పక్షవాతం: 31.
……………………………

గృహిణులు: 908.
జీతం పొందిన వ్యక్తులు: 803.
ప్రైవేట్ ఉద్యోగులు: 593.
విద్యార్థులు: 468.
ప్రభుత్వ ఉద్యోగులు: 70.
నిరుద్యోగులు: 1,769.
స్వయం ఉపాధి: 893.
స్వయం ఉపాధి (వ్యాపారం): 448.
రైతులు, వ్యవసాయ కార్మికులు: 796.
రోజువారీ వేతన సంపాదకులు: 2,496
…………………………

ఆదాయం స్థాయి
సంవత్సరానికి రూ. 1 లక్ష కంటే తక్కువ: 5,116.
రూ. 1 లక్ష నుండి రూ. 5 లక్షల మధ్య: 3,074.
రూ. 5 లక్షలు మరియు అంతకంటే ఎక్కువ: 302.
…………………………

చదువు
X తరగతి వరకు – 3,150.
XII తరగతి వరకు – 1,603.
బ్యాచిలర్ డిగ్రీ మరియు అంతకంటే ఎక్కువ – 262.
ప్రొఫెషనల్ డిగ్రీ – 34.