Pedakapu 1 Review : పెదకాపు-1 : రివ్యూ

Pedakapu 1 Reviewకొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సెన్సిబుల్ సిన్సియర్ ఎఫర్ట్ తో సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం

  • Written By:
  • Publish Date - September 29, 2023 / 03:57 PM IST

నటీనటులు : విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ, రావు రమేశ్‌, నాగబాబు, తనికెళ్ల భరణి, బ్రిగిడ సాగా, రాజీవ్‌ కనకాల, అనసూయ, ఈశ్వరి రావు

సంగీతం : మిక్కీ జే మేయర్‌

సినిమాటోగ్రఫీ : చోటా కె నాయుడు

ఎడిటింగ్‌ : మార్తాండ్‌ కె వెంకటేశ్‌

నిర్మాత : మిర్యాల రవీందర్‌రెడ్డి

దర్శకత్వం : శ్రీకాంత్‌ అడ్డాల

కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సెన్సిబుల్ సిన్సియర్ ఎఫర్ట్ తో సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో అడ్రస్ లేకుండాపోయాడు. తిరిగి నారప్ప సినిమాతో ట్రాక్ ఎక్కాడు. నారప్ప మేకింగ్ లోనే తనలోని మాస్ డైరెక్టర్ ని నిద్ర లేపాడు శ్రీకాంత్ అడ్డాల. ఆ నేపథ్యంలో పెదకాపు-1 అంటూ ఒక ప్రయత్నం చేశాడు. విరాట్ ప్రగతి జంటలుగా ద్వారక క్రియేషన్స్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి (Pedakapu 1 Movie Review) సమీక్షలో చూద్దాం.

కథ :

గోదావరి ప్రాంతం 1980 లో కుల, వర్గ విభేదాలున్న పరిస్థితులు ఉన్న లంక గ్రామం అది. అక్కడ సత్తి రంగయ్య (రావు రమేష్) బయన్న (ఆడుగళం నరేన్)ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. వీరి మధ్య గొడవల కారణంగా కింది స్థాయి వ్యక్తుల జీవితాలు బలవుతుంటాయి. వారిలో పెదకాపు (విరాట్ కర్ణ) కుటుంబం కూడా ఉంటుంది. ఆ గొడవల్లో పెదకాపు అన్నయ్య సత్తి రంగయ్య కోసం హత్య చేసి కనిపించకుండా పోతాడు. అదే కుటుంబానికి దగ్గరైన గౌరి కూడా ప్రాణాలు పోగొట్టుకుంటుంది. పెదకాపు అన్న ఏమవుతాడు..? ఆత్మగౌరవం కోసం పెదకాపు ఏం చేశాడు..? ఈ కథలో అక్కమ్మ ఎవరు లాంటి విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథనం :

ఆత్మగౌరవం, తన మనుషుల కోసం పోరాటం చేసేందుకు సామాన్యుడే నాయకుడిగా నిలబడటమే ఈ సినిమా కథా నేపథ్యం. పెదకాపు సామాన్యుడి సంతకం అని ట్యాగ్ లైన్ పెట్టిన దర్శకుడు ఆ ప్రయత్నం చేసినా అది సరిగా వర్క్ అవుట్ అవలేదని చెప్పొచ్చు. పెదకాపు సినిమాలో హీరో పాత్రకి బాగా వెయిట్ ఉంది. అతన్ని ఒక్కోసారి ఒక పాత్రలా చూపించాడు. మరోసారి అతనే మెయిన్ లీడ్ అన్నట్టుగా చూపించాడు.

హీరో కొత్త వాడయ్యే సరికి బలమైన మాటలకు సంబంధించిన ఎమోషన్ ని చూపించలేకపోయాడు. అయితే తన శక్తి మేరకు కష్టపడ్డాడు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా చాలా పెద్ద కథనే చెప్పాలని అనుకున్నా కథనంలో గందరగోళం వల్ల ప్రేక్షకులకు అనుకున్న విధంగా రీచ్ అవలేదని చెప్పొచ్చు.

60వ దశకంలో కథ మొదలై.. ఆ తర్వాత 80ల్లోకి కథ షిఫ్ట్ అవుతుంది. కథలోని కన్ ఫ్లిక్ట్ పాయింట్ ని చూపించకుండానే డైరెక్ట్ గా ఆత్మగౌరవం అంటూ జెండా పాతేలా చేస్తాడు. తను రాసుకున్న బలమైన పాత్రల్ని కథలో చూపించడంలో కన్ ఫ్యూజ్ అయ్యాడు శ్రీకాంత్ అడ్డాల. సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.

పాత్రలు.. వారి ద్వారా బలమైన మాటలు వస్తున్నా అవేవి ఆడియన్స్ కి కనెక్ట్ అయినట్టుగా అనిపించవు. సినిమాలో లోతైన సంభాషణలకు తగినట్టుగా సన్నివేషాలు వెయిట్ లేకపోవడం పాయింట్ అవుట్ చేసేలా ఉంటుంది. అయితే కొన్ని సీన్స్ సినిమాను ఆసక్తికరంగా తీసుకెళ్లినా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ గా ఉండటం వల్ల నిరాశ కలిగిస్తుంది.

ఈ సినిమా చూస్తున్నంత సేపు రంగస్థలం, దసరా, నారప్ప ఇలా చాలా సినిమాలు ఆలోచనలోకి వస్తాయి. హీరో హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ కూడా మెప్పించలేదు. టెక్నికల్ గా సినిమా భారీతనంతో తీశారు. కథ కథనాలు ఎమోషన్స్ ఆడియన్స్ ని కనెక్ట్ చేయలేదు. పెదకాపు 1 ఎండింగ్ కూడా సెకండ్ పార్ట్ మీద ఆసక్తి కలిగించేలా అనిపించలేదు.

నటీనటులు :

విరాట్ కర్ణ మొదటి సినిమాలో మంచి వెయిట్ ఉన్న పాత్ర చేశాడు. చాలా వరకు బాగానే మ్యానేజ్ చేసినా కొన్నిటిలో అనుభవ లేమి అర్ధమవుతుంది. ప్రగతి పర్ఫార్మెన్స్ బాగుంది. రావు రమేష్ తన విలక్షణ నటనతో మెప్పించారు. ఆడుగళం నరేన్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. అనసూయ, శ్రీకాంత్ అడ్డాల, నాగ బాబు, తణికెళ్ల భరణి మిగతా పాత్రదారులంగా కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

టెక్నికల్ గా పెదకాపు చాలా మంచి ఫీల్ అందిస్తుంది. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా ఉంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ మీద ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశాడు. డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల అనుకున్న పాయింట్ ని అనుకున్న విధంగా తెర మీద చూపించలేకపోయాడు. మంచి అభిరుచి ఉన్న ఈ దర్శకుడు పెదకాపు అనే బలమైన టైటిల్ తో మంచి కథ చెప్పాలనే ప్రయత్నం చేసినా అది ఆడియన్స్ కి రీచ్ అవడంలో నిరాశపరచింది.

ప్లస్ పాయింట్స్ :

డైలాగ్స్

సినిమాటోగ్రఫీ

మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ పొలిటికల్ స్టోరీ

స్లో నరేషన్

బాటం లైన్ : మెప్పించలేని పెదకాపు..!

రేటింగ్ : 2/5

Also Read :  Baby Franchise : ఎక్స్ క్లూజివ్ : లవ్ ఫెయిల్యూర్ కథలన్నీ బేబీ ఫ్రాంచైజ్ లుగా తీస్తే..!