Vizag : వైజాగ్ టెక్ స‌మ్మిట్ , 3వేల కోట్ల ఒప్పందాల‌కు ప్లాన్‌

కొత్త ఏడాది ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నూత‌న అడుగులు వేయ‌డానికి ప్లాన్ చేశారు.

  • Written By:
  • Updated On - December 2, 2022 / 01:58 PM IST

కొత్త ఏడాది ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నూత‌న అడుగులు వేయ‌డానికి ప్లాన్ చేశారు. వైజాగ్ కేంద్రంగా టెక్ స‌మ్మిట్ ను వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించ‌బోతున్నారు. సుమారు రూ. 3వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ఈ స‌మ్మిట్ ను ప్లాన్ చేసింది. ఏపీ ప్ర‌భుత్వం , ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా వైజాగ్ టెక్ సమ్మిట్‌ను నిర్వహించనుంది.

ఇలాంటి స‌మ్మిట్ లు ఐరోపా స‌హా ప‌లు ప్రాంతాల్లో ఇండో అమెరిక‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ నిర్వ‌హిస్తోంది. ఆ క్ర‌మంలో
11 ప్రధాన ప్రాంతాల్లో రోడ్ షోలు, పెట్టుబడిదారుల సమావేశాలు పెట్ట‌నుంది. ఆ జాబితాలో విశాఖపట్నం కూడా ఉంది. ఫిబ్ర‌వ‌రి 16, 17 తేదీల్లో జరిగే ఈ స‌ద‌స్సుకు ప్రపంచ ఆవిష్కర్తలు, ప్రభావశీలురు, ఆలోచ‌నాప‌రులు హాజ‌రు కానున్నారు. అందుకోసం రూ. 100 కోట్ల ఇంపాక్ట్ ఫండ్ ఏర్పాటుతో సహా అనేక రకాల నిర్ణయాధికారులకు కేంద్రం కానుంది.

అభివృద్ధి చెందుతున్న టెక్ కంపెనీలు ఈవెంట్ సమయంలో 3000 కోట్లు విలువ చేసే ఒప్పందాల‌పై సంత‌కాలు చేసే అవ‌కాశం ఉంద‌ని ఇండో అమెరిక‌న్ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అంచ‌నా వేస్తోంది. రూ. 1,000 కోట్లు క్లోజర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నాయని పల్సస్ సీఈవో తెలిపారు. సమ్మిట్ ప్రధాన నిర్వాహకుడు సమ్మిట్ పోస్టర్‌ను ఇండోఅమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మినిస్టర్ ఆఫ్ కమర్షియల్ అఫైర్స్, యునైటెడ్ స్టే ట్స్ ఎంబసీ, న్యూఢిల్లీ జోనాథన్ హీమర్ మరియు శ్రీనుబాబు విడుద‌ల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ గ్రూప్ సీఈవో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడిదారులకు వైజాగ్ టెక్ సమ్మిట్ వేదిక కానుందని అన్నారు.