PRC: పీఆర్సీ లో నిజం ఇదీ..! 25వేల కోట్ల లబ్ది మాటేంటి?

సీఎంగా జగన్ భాధ్యతను తీసుకున్న 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్‌ ప్రకటించాడు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు ఆశావర్కర్లు,హోంగార్డులు,ఎంఎన్‌ఓల జీతాలు సచివాలయ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించాడు.

  • Written By:
  • Publish Date - January 21, 2022 / 07:47 PM IST

సీఎంగా జగన్ భాధ్యతను తీసుకున్న 30 రోజుల్లోనే 27 శాతం ఐఆర్‌ ప్రకటించాడు.కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరి వేతనాలు పెంచారు ఆశావర్కర్లు,హోంగార్డులు,ఎంఎన్‌ఓల జీతాలు సచివాలయ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో నియమించాడు. ఫలితంగా తొలి ఏడాది సుమారు 13 వేల కోట్ల భారం ప్రజలపై పడింది. అనూహ్యంగా కోవిడ్‌ వల్ల ఆర్థిక పరిస్థితులు తారుమారు అయ్యాయి.
ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. అటు వ్యయం పెరిగింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు కూడా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు.అంగన్‌వాడీ వర్కర్లు, యానిమేటర్ల వేతనాలు కూడా పెంచారు. శానిటరీ వర్కర్ల జీతాలు రూ.8 వేల నుంచి రూ.18 వేలకు పెంచారు. ఆశావర్కర్లు, ఎంఎన్‌ఓల జీతాలు పెంచారు. వారి జీతాన్ని రూ.6700 నుంచి రూ.17,746 కు పెంచారు. కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల జీతాలు రూ.400 నుంచి రూ.4 వేలకు పెంచారు. అలాగే హోంగార్డులకు అలవెన్సులు పెంచి, జీతాలు పెంచడం జరిగింది.
అలాగే కుక్‌ కమ్‌ హెల్పర్ల జీతాలు రూ.1000 నుంచి రూ.3 వేలకు పెంచారు. ఇక కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గతంలో ఏటా రూ.1100 కోట్లు చెల్లిస్తే, ఇప్పుడు ప్రభుత్వం రూ.3 వేల కోట్లు చెల్లిస్తోంది.
అలాగే ఆర్టీసి ఉద్యోగులు 57 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరిగింది.
కోవిడ్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్‌ లోగా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం గ్రామ , వార్డ్ సచివాలయాల్లో 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను నియమించడం జరిగింది. వారి సర్వీసును కూడా జూన్‌లో రెగ్యులరైజ్‌ చేయబోతున్నారు. రాష్ట్ర సొంత ఆదాయం.. జగన్‌ సీఎం అయ్యే నాటికి, అంటే 2018–19లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.62,473 కోట్లు అయితే, ఆయన సీఎం అయిన తర్వాత తొలి ఏడాది, అంటే 2019–20లో ప్రభుత్వ ఆదాయం రూ.60,933 కోట్లు. నిజానికి అప్పుడు రూ.71,844 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా, అంతకు ముందు ఏడాది కంటే కూడా దాదాపు రూ.2 వేల కోట్ల ఆదాయం తగ్గింది. 2020–21లో ప్రభుత్వ ఆదాయాన్ని రూ.82,620 కోట్లుగా అంచనా వేస్తే, రూ.60,688 కోట్లు మాత్రమే వచ్చాయి
ఒకవైపు పెరగాల్సిన రీతిలో ఆదాయం పెరగలేదు. కోవిడ్‌ వల్ల దాదాపు రూ.21 వేల కోట్లు ఆదాయం కోల్పోగా, కోవిడ్‌ వల్ల ప్రజలను కాపాడుకోవడం కోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కూడా సక్రమంగా రాలేదు. జీఎస్టీ, ఆదాయం పన్ను నుంచి పూర్తిగా రాలేదు.
2018–19లో కేంద్రం నుంచి మనకు రూ.32,722 కోట్లు రాగా, 2019–20లో రూ.28,221 కోట్లకు, ఆ తర్వాత ఏడాది 2020–21లో రూ.24,441 కోట్లకు పడిపోయాయన్న విషయాన్ని వాస్తవాన్ని అందరూ గమనించాలి.
ఆదాయం–జీతభత్యాలు:
2018–19లో ప్రభుత్వ సొంత ఆదాయం దాదాపు రూ.62,500 కోట్లు కాగా, ఆరోజు ఉద్యోగుల జీతభత్యాల కింద రూ.52,513 కోట్లు చెల్లించడం జరిగింది, అంటే ప్రభుత్వ ఆదాయంలో దాదాపు రూ.10 వేల కోట్లు మిగిలాయి. అలాగే 2020–21 లో ప్రభుత్వ సొంత ఆదాయం రూ.60,688 కోట్లు కాగా, సీఎం నిర్ణయం మేరకు ఐఆర్‌ ఇవ్వడంతో ఉద్యోగులకు ఆ ఏడాది జీతభత్యాల కింద రూ.67,340 కోట్లు చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని మించి 111 శాతం చెల్లించిన విషయాన్ని గమనించాలి.
ఉద్యోగుల జీతభత్యాల కింద ఇప్పుడు రూ.60,177 కోట్లు చెల్లిస్తుండగా, కొత్త పీఆర్సీ అమలు చేస్తే రూ.70,424 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. అంటే రూ.10 వేల కోట్లకు పైగా ఎక్కువ చెల్లింపు జరగనుంది. జగన్ సీఎం అయిన తరువాత పెంచిన జీతాలు, భత్యాల రూపంలో 13 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం పడింది. ఇప్పుడు మళ్లీ పీఆర్స్ రూపంలో మరో 12 వేల కోట్లు భారం పడనుంది. వెరసి రెండున్నారేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులు సుమారు 25 వేల కోట్లు లబ్ది పొందారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన డేటా. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియా ముఖంగా బయటపెట్టిన వాస్తవాలు. మరి ఇప్పుడు ఏపీ ప్రజలు, ఉద్యోగులు ఆలోచించండి.!