Red Sandal : ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ పై రెండు ప్ర‌త్యేక కోర్టులు

ఎర్రచందనం అక్రమ రవాణా పై న‌మోద‌వుతోన్న కేసుల త‌క్ష‌ణ‌ పరిష్కారం కోసం రెండు ప్రత్యెక కోర్టులు తిరుప‌తి కేంద్రంగా ప్రారంభం అయ్యాయి.

  • Written By:
  • Publish Date - June 9, 2022 / 09:00 PM IST

ఎర్రచందనం అక్రమ రవాణా పై న‌మోద‌వుతోన్న కేసుల త‌క్ష‌ణ‌ పరిష్కారం కోసం రెండు ప్రత్యెక కోర్టులు తిరుప‌తి కేంద్రంగా ప్రారంభం అయ్యాయి. అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకొని శేషాచల అడవులను పరిరక్షించాల‌ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణా పై సత్వర పరిష్కారం కొరకు రెండు ప్రత్యెక కోర్టులు తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందనీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణ అన్నారు. స్థానిక ఎస్ వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యెన్ వి రమణకు జరిగిన అభినందన సభలో వారు మాట్లాడుతూ తిరుపతికి రావడం ఆ వేంకటేశుని దర్శించుకోవడం కోసం ఏ అవకాశం వచ్చిన మహా భాగ్యంగా భావిస్తానని సుప్రీ౦ కోర్ట్ అఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ నూతనపాటి వెంకట రమణ తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణా నివారించడం కోసం రెండు ప్రత్యేక న్యాయస్థానాలు ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందన్నారు. అత్యంత విలువైన ఎర్రచందనం తిరుపతి శేషాచలం అడవులలో మాత్రమే దొరుకుతుందని, ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత విలువైనదని అసాధారణమైన రంగు , అత్యంత ఔషధ గుణాలు కలిగినందునే ఎర్రచందనంను ఎర్రబంగారంగా మార్చారని అన్నారు. అందువలనే ఈ ఎర్ర చందనం కి సంబంధించి చాల సమస్యలు రావడం జరిగింది అని తెలిపారు. ఈ ఎర్రచందనం దాదాపు 5300 చ.కిమీ దూరం వరకు వేలసంఖ్యలో ప్రకృతి సిద్ధంగా విస్తరించి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కోట్లు పలుకుతోందని అన్నారు. గత దశాబ్ద కాలంగా దీనిని స్మగ్లర్లు అక్రమ మార్గాల ద్వారా నరికి విదేశాలకు ఎగుమతి చేసే కార్యక్రమాన్ని ఒక వృత్తిలాగా చేపట్టి అక్రమార్జనకు అలవాటు పడ్డారని అన్నారు.

అటవీ పర్యావరణాన్ని మరియు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. ఈ మూడు దశాబ్దాలలో ఎర్రచందనం 30 నుండి 50 శాతం వృక్షాలను కొట్టివేయడం జరిగిందని అన్నారు. దురదృష్ట వశాత్తు చట్టంలోని బలహీనతలు సరైనటువంటి పటిష్టమైన న్యాయవ్యవస్థ లేకపోవడం, తక్కువ శిక్షలతో బయటపడతామనే ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో దీనివైపు ఆకర్షితులై ఈ అక్రమ రవాణా కు పాల్పడుతున్నారని తెలిపారు. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే 1 సం జైలు శిక్ష 10 వేలు జరిమానా ఉండేది. దీనితో స్మగ్గ్లింగ్ చేసే ముఠాలు పెద్ద సంఖ్యలో స్మగ్గ్లింగ్ కు పాల్పడే వారి కుటుంబాలకు అండగా నిలిచి వారిని పోషించి వారు శిక్ష నుండి బయటకు రాగానే యధావిధిగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. తుడా కాంప్లెక్స్ లో తక్కువ ఆద్దేకే ఇచ్చి ఈ కోర్టుల ఏర్పాటు కి సహకరించిన చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి శాసన సభ్యులు కరుణాకర రెడ్డికి అభినంద‌న‌లు తెలిపారు.