Pawan Chiranjeevi: రాజకీయాల్లో అన్న ఓడాడు.. తమ్ముడు నెగ్గాడు..

రాజకీయాల్లో మెగాస్టార్‌ స్టార్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. కానీ తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ హిట్‌ కొట్టాడు. అన్న ఫెయిల్యూర్‌కి, తమ్ముడు సక్సెస్‌కి కారణం ఏంటి? ఇద్దరిలో ఉన్న తేడా ఏంటి?

  • Written By:
  • Updated On - June 12, 2024 / 05:20 PM IST

Pawan Kalyan: రాజకీయాల్లో (Politics) సినీ తారల ప్రభావం గట్టిగానే ఉంటుంది. చాలా మంది నటులు (Actor) రాజకీయాల్లోకి వచ్చారు కానీ.. వారిలో కొందరు మాత్రమే సక్సెస్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌ (NTR) మాత్రమే సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత మరే నటుడు కూడా… ఆ స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయారు. కృష్ణ, దాసరి, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బాబు మోహన్‌, మురళీ మోహన్‌ వంటి వారు రాజకీయాల్లోకి వెళ్లారు. పదవులు అనుభవించారు. కానీ ఎన్టీఆర్‌లా రాజకీయాలను శాషించలేదు. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కూడా… రాజకీయాల్లోకి ఓ సునామీలా వచ్చి వెళ్లిపోయాడు. రెండు మూడేళ్లలోనే పార్టీని క్లోజ్‌ చేశాడు. ఆయన కేంద్ర మంత్రి (Centrel Minister) అయ్యాడు. కానీ తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) లా సక్సెస్‌ కాలేకపోయాడు.

పవన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలను శాషిస్తున్నాడు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడు. ఏపీలో కూటమి (Alliance) ఏర్పాటు చేయించి అది విజయం సాధించేలా చేశాడు. రేపు ప్రభుత్వంలో (Goverment) కీలక బాధ్యతలు చేపట్టబోతున్నాడు. మరి చిరంజీవి(Chiranjeevi) సక్సెస్‌ కాలేకపోవడానికి కారణమేంటి? ఆయన చేసిన మిస్టేక్‌  (Mistake)ఏంటి? పవన్‌ కళ్యాణ్‌ సక్సెస్‌ కి కారణమేంటి? ఆయన రాజకీయాలను శాషించే స్థాయికి ఎదగడం వెనుకున్న కథేంటి? రాజకీయాలకు సంబంధించి మెగా హీరోల్లో చిరంజీవి, పవన్‌కి మధ్య ఉన్న తేడా ఏంటి? తెరవెనుక ఉన్న కారణాలేంటి?

మెగాస్టార్‌ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని (Praja Rajyam Party) స్థాపించాడు. ఆగస్ట్ 2న భారీ స్థాయిలో ఈవెంట్‌ ఏర్పాటు చేసి పార్టీ పేరుని ప్రకటించారు చిరంజీవి. అప్పట్లో మెగాస్టార్‌కి సినిమా పరంగా భారీ క్రేజ్‌ ఉంది. అత్యంత మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో. దీంతో జనం కుప్పులు తెప్పలుగా వచ్చారు. కానీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి 294 సీట్లకుగానూ.. కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చాయి. చిరంజీవి ఎన్నికలకు ఆరు నెలల ముందే మాత్రమే పార్టీని స్థాపించాడు. ఆ ఆరు నెలల్లోనే జనం ముందుకు వెళ్లాడు. దీంతో ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయాడు.

నిజానికి 2009 ఎన్నికల (Election) సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలకు సంబంధించిన గ్యాప్‌ లేదు. కాంగ్రెస్‌  (Congress) పార్టీ బలంగా ఉంది. రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. అంతేకాదు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు కూడా గట్టిగా ఉన్నాడు. టీడీపీ (TDP) గ్రామాల స్థాయిలో బలమైన క్యాడర్‌ని కలిగి ఉంది. ఈ రెండు పార్టీలకు గ్రౌండ్‌ లెవల్‌లో బలమైన పునాదులున్నాయి. దీనికితోడు తెలంగాణలో ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతూనే ఉంది. ఇలా ఈ మూడు పార్టీలు ఉన్నంతలో బలంగా ఉన్నాయి. రాజకీయపరమైన గ్యాప్‌ ఏమాత్రం లేదు.

అలాంటి సమయంలో మెగాస్టార్‌ ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. రాజకీయ ఉద్దండులు రాజశేఖర్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడు, తెలంగాణ సెంటిమెంట్‌ పార్టీ టీఆర్‌ఎస్‌ని (TRS) ఎదుర్కొని 18 సీట్లు గెలిచారు. తెలంగాణలో కేవలం ఒకే సీట్‌ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే మిగిలిన 17 సీట్లు (Assembly Seats) వచ్చాయి. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి (Chiranjeevi) ఒక్క చోటే విజయం సాధించారు. ఈ ఫలితాలు చిరంజీవికి పెద్ద షాక్‌ ఇచ్చాయి. అధికారం ఫామ్‌ చేయాలనే టార్గెట్‌తో, ఎన్టీఆర్‌లా తాను కూడా ఓ సునామీలో రాజకీయ ప్రత్యమ్నాయంగా రావాలని భావించి పీఆర్‌పీని స్థాపించిన చిరుకి ఈ ఫలితాలు పెద్ద షాక్‌ ఇచ్చాయి.

చిరంజీవి.. 2009 ఎన్నికల అనంతరం కేవలం రెండేళ్లు మాత్రమే తన పార్టీని కొనసాగించాడు. ఆ వెంటనే కాంగ్రెస్‌ పార్టీలో తన పీఆర్‌పీని విలీనం చేశాడు. తాను కేంద్రమంత్రి పదవి తీసుకున్నారు. స్వతంత్ర్య హోదాలో టూరిజం మంత్రిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా ఆ రెండేళ్లు పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం పూర్తిగా రాజకీయాలకే (Politrics) దూరమయ్యాడు. చిరు.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం (Merge) చేయడానికి ప్రధాన కారణం ఆయన ప్రత్యక్ష రాజకీయాలను ఎదుర్కోలేకపోయాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయలేకపోయాడు, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో (Ground Level) పోరాడలేకపోయాడు.

కానీ పవన్‌ కళ్యాణ్‌ (Pawan) అలా చేయలేదు. ఆయనకు పూర్తిగా భిన్నంగా (Different) వ్యవహరిస్తూ వచ్చాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) స్థాపించినప్పుడు అన్నతోనే ఉన్నాడు పవన్‌. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ఓ సునామీలా ప్రచారం నిర్వహించాడు. ఆ తర్వాత పరిణామాలు పవన్‌ కళ్యాణ్‌కి అనుభవాన్ని తెచ్చిపెట్టాయి. రాజకీయాలపై (Politrics) కొంత అవగాహన వచ్చింది. అనంతరం తాను రాజకీయాల్లోకి వచ్చాడు. అన్న చేసిన తప్పు చేయకూడదని తాను పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2014 మార్చి 14న పవన్‌ జనసేన పార్టీని స్థాపించాడు.

కొన్నాళ్ల తర్వాత పవన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లాడు. నెమ్మదిగా పుంజుకోవాలని, గ్రౌండ్‌ లెవల్‌లో (Ground Level) క్యాడర్‌ని బిల్డ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఐదేళ్లలో (Five Years) ఆ పని చేశాడు. చాపకింద నీరులా నెమ్మదిగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లాడు పవన్‌. తరచూ జనంలో (Public) ఉన్నాడు. మీటింగ్ లలో ప్రభుత్వాన్ని విమర్శించాడు. విరుచుకుపడ్డాడు. ప్రభుత్వంలోని నాయకులు ఎలా మాట్లాడితే అలానే మాట్లాడాడు, ఇంకా చెప్పాలంటే విమర్శల డోస్‌ పెంచాడు, వ్యక్తిగతంగానూ టార్గెట్‌ చేసి మాట్లాడాడు. ఇవన్నీ పవన్‌ని జనంకి దగ్గర చేశాయి. చిరంజీవిలా (Chiranjeevi) వెళ్లిపోయే వాడు కాదు, ఉండేవాడని జనం నమ్మేలా చేశాయి. దీంతోపాటు పవన్‌ రాజకీయాలను నేర్చుకున్నాడు. సామాజిక సమీకరణాల గురించి తెలుసుకున్నాడు. ఓట్ల మేనేజ్‌మెంట్‌ తెలుసుకున్నాడు.  మొత్తానికి సక్సెస్ అయ్యాడు.