బెస్ట్ ఎడ్యుకేషన్ దిశగా ఏపీ ఎయిడెడ్ స్కూల్స్

ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు వేలకుపైగా ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఒకవైపు కరోనా కరాణంగా, మరోవైపు లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థల్లో టీచింగ్ నిలిచిపోయింది. పాఠశాలలు ఉండి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, అన్ని వసతులు ఉన్నా కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం లేదు.

  • Written By:
  • Updated On - September 29, 2021 / 12:39 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రెండు వేలకుపైగా ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఒకవైపు కరోనా కరాణంగా, మరోవైపు లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థల్లో టీచింగ్ నిలిచిపోయింది. పాఠశాలలు ఉండి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, అన్ని వసతులు ఉన్నా కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం లేదు. ఆర్థిక సమస్యతోనూ పలు స్కూళ్లు మూతపడే నెలకొంది. అయితే వీటిలో కొన్ని ఎయిడెడ్ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు ఇస్తున్నా, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా అనుకున్న ఫలితాలు రావడం లేదు.  ఈ  నేపథ్యంలో ఎయిడెడ్ స్కూళ్ల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. అన్ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడవని ఒక వేళ యాజమాన్యాలు మూసివేయాలని నిర్ణయించుకుంటే వాటిని ప్రభుత్వమే నడుపుతుందని వెల్లడించారు.

గ్రాంట్ ఇన్ ఎయిడ్ విద్యాసంస్థలు మూతపడవని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఏపి ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవన్నారు. ఈ సంస్కరణలు తీసుకువచ్చింది విద్యాసంస్థల ఆస్తులను కొట్టేసేందుకు కాదని మంత్రి స్పష్టం చేశారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కళాశాలల్లో అధ్యాపకులకు సాధారణ రీతిలోనే బదిలీలు ఉంటాయని పేర్కొన్నారు. ఏపీలోని 90 శాతంపైగా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు సైతం ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థలు, సిబ్బందిని అటాచ్ చేసే ప్రక్రియను సోమవారం కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రారంభించారు. గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థల ద్వారా కాంట్రాక్టుపై నియమించబడిన ఉద్యోగులు తిరిగి అవసరమైనప్పుడు కళాశాలలు మరియు పాఠశాలల్లో భర్తీ చేయబడతారని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు.

పెద్ద సంఖ్యలో సంస్థలు తమ గ్రాంట్-ఇన్-ఎయిడ్ హోదాను వదులుకుని తమ సిబ్బందిని అప్పగించాయి, కొన్ని తమ ఆస్తులను కూడా వదులుకోవడానికి అంగీకరించాయని మంత్రి చెప్పారు. 133 డిగ్రీ కాలేజీలలో 125-దాదాపు 93 శాతం-ఇప్పటివరకు తమ గ్రాంట్-ఇన్-ఎయిడ్ స్థితిని సరెండర్ చేశాయని, సిబ్బందిని ప్రభుత్వానికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. కనీసం ఏడు సంస్థలు కూడా తమ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడానికి అంగీకరించాయి.