విద్యార్థులకు టీచర్ల కొరత.. చదువులు సాగెదెట్లా?

ప్రతి తరగతికి లెక్కకు మించి విద్యార్థులు.. మెరుగైన స్కూల్ బిల్డింగ్స్. కావాల్సిన పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్ని అసౌకర్యాలు ఉన్న పాఠశాలలకు టీచర్లే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా ఉంటుంది అని చెప్పక తప్పదు.

  • Written By:
  • Updated On - October 7, 2021 / 02:59 PM IST

ప్రతి తరగతికి లెక్కకు మించి విద్యార్థులు.. మెరుగైన స్కూల్ బిల్డింగ్స్. కావాల్సిన పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్ని అసౌకర్యాలు ఉన్న పాఠశాలలకు టీచర్లే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా ఉంటుంది అని చెప్పక తప్పదు. ఆంధ్రప్రదేశ్ 14శాతం స్కూళ్లకు టీచర్ల కొరత ఉంది. కేవలం ఒకే ఒక టీచర్ సాయంతో స్కూల్స్ నడుస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్ విద్యారంగం నిర్వహణ ఎలా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ‘‘యూనెస్కో, స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్’’ రిపోర్ట్ ప్రకారం 2021లో 14శాతంపై పాఠశాలల్లో సింగిల్ టీచర్ తోనే బోధన జరుగుతుందని తేల్చి చెప్పింది. 60 మంది ఉన్న ప్రైమరీ స్కూల్స్ కు సైతం ఒక్క టీచర్ సాయంతోనే నడుస్తుండటం గమనార్హం. విద్యార్థుల కనుగుణంగా సరిపడు టీచర్లు లేకపోవడంతో బెస్ట్ ఎడ్యుకేషన్ అందలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లకు పిల్లలకు ఎన్నో పథకాలు అందిస్తున్నప్పటికీ, టీచర్ల పోస్టింగ్ పై ఫోకస్ చేయలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇటీవలకాలంలో ప్రభుత్వ ప్రవేశపెట్టిన అమ్మవడి పథకంవల్ల ప్రతి పాఠశాలలోను విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు లేకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో బోధన చేసే ఉపాధ్యాయులు లేక విద్య అరకొరగా అందుతోంది. దీంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు నైపుణ్యం సాధించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒకపక్క ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని పదే పదే హెచ్చరిస్తున్న విద్యాశాఖ ఆ స్థాయిలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్ర గణాంకాల ప్రకారం ప్రతి ప్రైమరీ స్కూల్ కు ఇద్దరు టీచర్లు ఉండాలి. ఇద్దరిలో ఒకరు మహిళా ఉపాధ్యాయురాలై ఉండి తీరాలి. సర్వశిక్ష అభియాన్ కింద బాలికలు చదివే పాఠశాలకు మొత్తానికి మొత్తం మహిళా టీచర్లు ఉండి తీరాలి. అంతేకాదు.. మారుతున్న కాలానుగుణంగా టీచింగ్ సిస్టమ్ కూడా మారాలి. బ్లాక్ బోర్డులపై పాఠాలపై చెప్పడమే కాకుండా రేడియో, టెలివిజన్ ద్వారా పాఠాలు బోధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ టిచింగ్ ను పిల్లలకు అందించాల్సి ఉంటుంది. కానీ చాలా రాష్ట్రాల్లో డిజిటల్ స్టడీ కొనసాగడం లేదని పలువురు వాపోతున్నారు.