Site icon HashtagU Telugu

Emoji : ఆ ఎమోజీ(emoji)వాడితే జైలుకే, భారీ జరిమానా కూడా… ఎక్కడో తెలుసా?

Sending heart emojis to girls can land you in jail and Huge fine in Kuwait and Saudi Arabia

Sending heart emojis to girls can land you in jail and Huge fine in Kuwait and Saudi Arabia

ప్రస్తుతం యువత వాట్సాప్‌( WhatsApp)లోనే ఉంటున్నారు. అందులోనే తింటున్నారు, మునుగుతున్నారు, తేలుతున్నారు. అన్నీ వాట్సాప్ లోనే. కానీ ఒక్కోసారి అదే మన ప్రాణాలమీదకి వస్తోంది. మొన్నటికి మొన్న ఓ దేశంలో థంబ్స్ అప్ (thumbs up) ఎమోజీని అంగీకారంగా భావించామని కోర్టులో కేసు వేసిన ఓ వ్యక్తి భారీగా ఫైన్ చెల్లించుకున్నాడు. ఇప్పుడు అలాంటిదే మరో సంఘటన నేపథ్యంలో కువైట్ (Kuwait), సౌదీ( Saudi) లలో ఓ కొత్త రూల్ ప్రకటించారు. దీని ప్రకారం సోషల్ మీడియా(social media) ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ (Heart) ఎమోజీ(emoji)ని పంపిన వారు తీవ్రమైన శిక్షను ఎదుర్కొంటారు.

నిజానికి తమకు ఇష్టమైన వారికి హార్ట్ ఇమేజ్ పంపడం చాలా కామన్. దీనికి అమ్మాయిలు, అబ్బాయిలు అని ప్రత్యేకమైన తేడా ఏం లేదు.. కానీ అక్కడ అలా కాదు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అమ్మాయిలకు హార్ట్ ఎమోజీని పంపిన వారు శిక్షను ఎదుర్కొంటారని సౌదీ, కువైట్ మీడియా తాజాగా తెలిపింది.

కువైట్‌లో హార్ట్ ఎమోజీని పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, 2,000 కువైట్ దినార్లు అంటే రూ.5,35,825 జరిమానా. కువైట్‌లోనే కాదు సౌదీ అరేబియాలో కూడా సోషల్ మీడియాలో హార్ట్ ఎమోజీని పంపడం అభ్యంతరకరం అని తెలుస్తోంది. ముఖ్యంగా సౌదీ లో రెడ్ హార్ట్ ని పంపితే సౌదీ చట్టం ప్రకారం నేరం రుజువైతే రెండేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అదనంగా 100,000 సౌదీ రియాల్స్ అంటే రూ.21,93,441 జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.

చాట్‌లో ఉపయోగించిన ఎమోజీలపై లేదా మాటలపై మహిళలు ఫిర్యాదు చేస్తే,.. దాన్ని వేధింపుల ఫిర్యాదులో చేర్చుతామని సౌదీ అరేబియా యాంటీ ఫ్రాడ్ అసోసియేషన్ ప్రకటించింది. ఇక చేసిన తప్పునే మళ్లీ మళ్ళీ చేస్తే వారికి 300,000 సౌదీ రియాల్స్ అంటే రూ.65,80,324 జరిమానా విధిస్తారు. గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షకు కూడా అవకాశం ఉంది.
నిజానికి గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో మనకి తెలిసిందే. అక్కడ మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని కటకటాల వెనక్కి నెట్టేస్తాయి. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి, అక్కడ ఉండేవారికి ఆ చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన ఉండటం చాలా అవసరం. సో.. ఈ రెండు దేశాలలో ఉండే ప్రవాసులు తమ వాట్సాప్ చాట్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు.

 

Also Read : Thumbs Up Emoji: ఆ ఒక్క ఏమోజితో రైతు జీవితం తారుమారు.. రూ. 50 లక్షలు జరిమానా?