Site icon HashtagU Telugu

Bikini : బికినీ తో బస్సెక్కిన మహిళ..ఆలా చూస్తూ ఉండిపోయిన ప్రయాణికులు

Bikini Women

Bikini Women

మనదేశం(India)లో ఒకప్పుడు మహిళలు చూస్తే నిండుగా చీరతో కనిపించేవారు…చూడగానే తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించేవారు. కానీ ఇప్పుడు అంత మారిపోయింది..చీర అంటే అబ్బే అంటూ.. విదేశీ సంప్రదాయాల అలవాటు చేసుకుంటున్నారు. చీర అనేది పండగలకు , ఇంట్లో ఫంక్షన్లకు తప్పితే వాటి జోలికే వెళ్లడం లేదు. ఎంత సేపు జీన్స్, టీ షర్ట్స్.. స్కర్ట్స్ ఇలా ఎవరు చూడు ఇలాగే కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఢిల్లీ (Delhi) లో ఏకంగా బికినీ (Bikini) తో ఓ మహిళ బస్సెక్కి షాక్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

మాములుగా బికినీ అంటే సినిమాల్లో లేదా..బీచ్ లలో ఎక్కువగా చూస్తుంటాం. అలాంటిది నిత్యం కిటకిటలాడే బస్సు లో బికినీ తో ఎక్కేసరికి మహిళలు ఛీ..ఛీ అనుకుంటే..మగవారు మాత్రం భలే ఛాన్స్ అంటూ వారి ఫోన్లలో వీడియోస్ తీసి భద్రపర్చుకున్నారు. ఈ మధ్య ఢిల్లీ లో మహిళలు రెచ్చిపోతున్నారు.ఆ మధ్య మెట్రో లో వికృత చేష్టలు చేసి పోలీస్ స్టేషన్ లకు పోయిన ఘటనలు, బైక్ ఫై ఇద్దరు మహిళలు రొమాన్స్ గా చేసుకుంటూ వెళ్లిన ఘటనలు వైరల్ కాగా… ఇక ఇప్పుడు ఏకంగా బికినీ తో బస్సు ఎక్కి వార్తల్లో నిలిచింది ఓ మహిళ. జుట్టు విరబోసుకుని.. బికినీ ధరించి సడెన్ గా బస్సు ఎక్కే సరికి తోటి ప్రయాణికులంతా షాక్ అయ్యారు. మహిళలైతే ఛీ..ఛీ అనుకుంటూ దూరం జరుగగా..మగవారు మాత్రం అబ్బా అనుకుంటూ తమ ఫోన్లకు పనిచెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read Also : OG – Mirai : మిరాయ్‌ మూవీతో ఓజికి పోలిక.. తేజ సజ్జ ఇంటరెస్టింగ్ కామెంట్స్..