Site icon HashtagU Telugu

Zinc Man : బాడీకి జింక్ అందించేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగేశాడు.. ఏమైందంటే ?

Zinc Man

Zinc Man

Zinc Man : జింక్ శరీర నిర్మాణానికి సహాయపడుతుందని అతడు నమ్మాడు. ఇందులో తప్పేం లేదు. కానీ ఏ రూపంలోనైనా జింక్‌ను శరీరంలోకి తీసుకోవచ్చని భావించడం దగ్గరే అతగాడు పెద్ద తప్పు చేశాడు. బాడీలో జింక్ మోతాదును పెంచు కునేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగడం మొదలుపెట్టాడు ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల యువకుడు. దీంతో గత 20 రోజులుగా అతడికి తీవ్ర కడుపునొప్పి, వాంతులు వస్తున్నాయి. ఏమీ తినలేకపోయాడు. దీంతో చివరకు అతడిని  ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. ఈ రోగికి మొదట ఔట్ పేషెంట్ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ చెక్ చేశారు. గత కొన్ని వారాలుగా ఆ యువకుడు నాణేలు, అయస్కాంతాలు తిన్నాడని రోగి బంధువులు  డాక్టర్‌కు వివరించారు. మానసిక సమస్యల వల్ల ఇలా చేశాడని తెలిపారు. దీంతో ఆ యువకుడికి (Zinc Man) ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి పేగుల నుంచి 39 నాణేలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు.

We’re now on WhatsApp. Click to Join

అంతకుముందు ఆ యువకుడి పొత్తి కడుపు, పేగు భాగాలను ఎక్స్ రే, సీటీ స్కాన్‌లు తీయగా.. వాటిలోనూ నాణేల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయి. దీంతో అతడిని వెంటనే శస్త్రచికిత్సకు సిద్ధం చేశారు. చిన్న ప్రేగులలోకి అయస్కాంతాలు, నాణేలు చొరబడ్డాయని గుర్తించారు. దీంతో పేగులు తెరిచి నాణేలు, అయస్కాంతాలను బయటకు తీయాల్సి వచ్చింది. కడుపులో నుంచి మొత్తం 39 నాణేలు (రూ. 1, 2, 5 నాణేలు), 37 అయస్కాంతాలు (గుండె, గోళాకారం, నక్షత్రం, బుల్లెట్, త్రిభుజం ఆకారాలు) బయటికి తీశారు.

Also Read : UKs First Lady : ఇదీ సింప్లిసిటీ.. ఫ్యామిలీతో బ్రిటన్ ప్రథమ మహిళ

జింక్ లోపం తలెత్తకుండా ఉండాలంటే..

Also Read :RBI Penalty: మ‌రో మూడు బ్యాంకుల‌కు షాక్ ఇచ్చిన ఆర్‌బీఐ.. భారీగా జ‌రిమానా..!