X New Feature : ట్విట్టర్ (ఎక్స్)లో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దానిపేరే ‘ఆర్టికల్స్’. ఎక్కువ పదాలతో రాసిన పెద్ద కంటెంట్‌ను పోస్ట్ చేయడానికి ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ను ప్రీమియం+ చెల్లింపు వినియోగదారులు, ధృవీకరించబడిన సంస్థలకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. సాధారణ వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుందో లేదో అనే దానిపై ట్విట్టర్ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
We’re now on WhatsApp. Click to Join
- ‘ఆర్టికల్స్’ ఫీచర్లో(X New Feature) పెద్ద కంటెంట్‌తో పాటు ట్విట్టర్ యూజర్లు ఫొటోలు, వీడియోలను, లింక్‌లు, GIFలను పోస్ట్ చేయొచ్చు.
- కంటెంట్ రాసే సమయంలో బోల్డ్, ఇటాలిక్, బుల్లెట్ పాయింట్లు, నంబర్లు, స్ట్రైక్‌త్రూ టెక్స్ట్ వంటి వాటిని ఉపయోగించొచ్చు.
- ఒక వ్యాసానికి పరిమితి 100,000 అక్షరాలు లేదా దాదాపు 15,000 పదాలు ఉంటుంది.
- ఒకసారి పోస్ట్ చేసిన కంటెంట్‌ను ఎడిట్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి కూడా అనుమతి ఉంటుంది.
Also Read : Maruti Jimny : ఆ కారుపై రూ.లక్షన్నర డిస్కౌంట్.. కొనేయండి
ఎక్స్ యూజర్లకు ఆడియో, వీడియో కాలింగ్ ఫీచర్లను అందించేందుకు ఆ సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా సబ్స్క్రిప్షన్ తీసుకోని యూజర్లు సైతం ఉచితంగా ఎక్స్ యాప్ నుంచి ఆడియో, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను గతేడాది యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఐఓఎస్) ప్రీమియం యూజర్లకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత ఆండ్రాయిడ్ ప్రీమియం యూజర్లను ఈ ఫీచర్ వాడుకోవడానికి అనుమతిచ్చారు.
ఎలాన్ మస్క్ రాకతో.. భారీ మార్పులు
2022లో 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్, సంస్థలో అనేక భారీ మార్పులు తీసుకొచ్చారు. అందులో భాగంగా ట్విట్టర్‌కు ‘ఎక్స్’గా నామకరణం చేశారు. ఎక్స్‌ను సమగ్ర అప్లికేషన్‌గా చేయాలన్న ఆలోచనతో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఆడియా, వీడియో కాల్స్‌ను సాధారణ యూజర్లు ఉపయోగించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఎక్స్ యూజర్లు సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా, యాప్‌లోని ఏ యూజర్ నుంచి అయినా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు.