Site icon HashtagU Telugu

Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి

Income Tax A Flat

Income Tax A Flat

Income Tax – A Flat : ఇన్‌కమ్ ట్యాక్స్ (ఐటీ) పరిధిలోకి వచ్చే వ్యక్తి బ్యాంకు లోన్ తీసుకొని నిర్మాణం పూర్తయిన ఫ్లాట్‌ను కొంటే.. బ్యాంకుకు తిరిగి కట్టే అసలు మీద, వడ్డీ మీద విడివిడిగా ఆదాయపు పన్ను మినహాయింపులు పొందొచ్చు. బ్యాంక్‌ నుంచి పొందిన లోన్‌‌లో తిరిగి చెల్లించే అసలుపై సెక్షన్‌ 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు.. చెల్లించే వడ్డీపై సెక్షన్‌ 24బీ కింద రూ. 2 లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ను కొంటే పరిస్థితేంటి ? ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు నిబంధనలు వర్తిస్తాయా ? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

We’re now on WhatsApp. Click to Join

నిర్మాణ దశలోని ఫ్లాట్‌‌ను కొంటే..

బ్యాంకు నుంచి లోన్ తీసుకొని నిర్మాణ దశలో ఉన్న ఫ్లాట్‌‌ను కొంటే.. లోన్  అసలుపై సెక్షన్‌ 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు.. లోన్ వడ్డీపై సెక్షన్‌ 24బీ కింద రూ. 2 లక్షల వరకు వార్షిక మినహాయింపు వర్తించదు. నిర్మాణ దశలోని ఫ్లాట్/ఇంటిపై హౌసింగ్ లోన్‌ పొందాక ఈఎంఐ చెల్లింపు వెంటనే ప్రారంభమైనప్పటికీ.. లోన్‌పై వడ్డీ అమౌంట్ మాత్రమే ఆ ఈఎంఐలో ఉంటుంది. అసలులో ఒక్క రూపాయి కూడా ఈఎంఐలో కలవదు. ఫ్లాట్ నిర్మాణం పూర్తయ్యే వరకు ఈఎంఐలో వడ్డీని మాత్రమే  వసూలు చేస్తారు.  అందుకే ఇలాంటి సందర్భంలో  మీరు ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేసే సమయంలో సెక్షన్‌ 80సీ కింద గృహ రుణం మినహాయింపును పొందలేరు. హౌసింగ్‌ లోన్‌లో అసలు మొత్తం కట్‌ కాకపోయినా ఈఎంఐ ద్వారా వడ్డీ కడుతూ వెళ్తారు. దానిని కూడా వెంటనే క్లెయిం చేసుకోలేరు. సెక్షన్‌ 24బీ కింద ఈ వడ్డీ మినహాయింపును పొందాలంటే.. ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత.. దాన్ని మీరు తీసుకున్నట్లుగా  ‘పొసెషన్‌ సర్టిఫికేట్‌’ పొందాలి. ఆ తర్వాతే లోన్‌లో అసలు మొత్తం ఈఎంఐ(Income Tax – A Flat) ద్వారా కట్‌ కావడం ప్రారంభం అవుతుంది. ఆ టైంలోనే సెక్షన్‌ 24బీ కింద వడ్డీని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు.

Also Read : G Chinnareddy : చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా కలిగిన కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

ఆ వడ్డీని ఇలా క్లెయిమ్ చేసుకోండి

ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణం పూర్తయ్యే వరకు మనం కట్టిన వడ్డీ అమౌంటును.. ఇంటి నిర్మాణం కంప్లీట్‌ అయ్యాక 5 సమ భాగాలుగా క్లెయిమ్ చేసుకోవచ్చు. మీ ఇంటికి ‘పొసెషన్‌ సర్టిఫికేట్‌’ పొందిన సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నిర్మాణంలో ఉన్నప్పుడు చెల్లించిన వడ్డీని, నిర్మాణం పూర్తయిన తర్వాత చెల్లిస్తున్న వడ్డీని కలిపి మినహాయింపు పొందవచ్చు. అయితే, ఇక్కడో చిన్న షరతు ఉంది. సెక్షన్‌ 24B కింద ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు క్లెయిమ్‌ చేసుకోదగిన వడ్డీ మొత్తం (పాతది, కొత్తది కలిపి) రూ. 2 లక్షలకు మించకూడదు.