Site icon HashtagU Telugu

edit messages feature : వాట్సాప్ వెబ్ యూజర్స్ కోసం కొత్త ఫీచర్

Edit Messages Feature

Edit Messages Feature

ఎవరికైనా మనం వాట్సాప్ (whatsapp)  టెక్స్ట్ మెసేజ్ పంపాక.. దానిలో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తే !! ప్రస్తుతానికి పెద్దగా ఆప్షన్స్ లేవు !! వెంటనే మెసేజ్ ను డిలీట్ చేసి ఇంకో దాన్ని పంపే ఛాన్స్ మాత్రం ఉంది. వెంటనే డిలీట్ చేయకుంటే మాత్రం.. మెసేజ్ లో ఎలాంటి మార్పులు చేసే అవకాశమే ఉండదు. అయితే మెసేజ్ ను పంపిన 15 నిమిషాల్లోగా అందులో మార్పులు, చేర్పులు చేసే ఛాన్స్ ను కల్పించే సరికొత్త ఫీచర్ ను “ఎడిట్ మెసేజ్” (edit messages feature) పేరుతో తీసుకొచ్చేటందుకు వాట్సాప్ రెడీ అవుతోంది. వాస్తవానికి ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ఫీచర్‌ గురించి వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం దీని బీటా వెర్షన్‌ ను ఎంపిక చేసిన వాట్సాప్ వెబ్ వినియోగదారులతో టెస్ట్ చేయిస్తున్నారు. త్వరలోనే ఈ ఫీచర్ (edit messages feature)ను అఫీషియల్ గా లాంచ్ చేయనున్నారు. ఈవివరాలను వాట్సాప్ డెవలప్మెంట్స్ ను ట్రాక్ చేసే WABetaInfo వెల్లడించింది.

also read : Whatsapp: అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయా.. అయితే వెంటనే అలా చేయండి?

టెక్స్ట్ మెసేజ్ ను సెలెక్ట్ చేయగానే ఇన్ఫో, కాపీ, ఎడిట్ అనే మూడు ఆప్షన్స్ వస్తాయి. ఎడిట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకొని .. మెసేజ్ ను పంపిన 15 నిమిషాలలోగా ఎన్ని సార్లయినా టెక్స్ట్ లో మార్పులు చేయొచ్చు. టెక్ట్స్ లో మార్పులు చేశాక.. “కంప్లీట్” అనే ఆప్షన్స్ వస్తుంది. దాన్ని నొక్కగానే మీరు చేసిన మార్పులు సేవ్ అవుతాయి. మీరు మెసేజ్ లు పంపిన వాళ్లకు .. మార్పులు చేసిన కొత్త మెసేజ్ మాత్రమే కనిపిస్తుంది. వాట్సాప్ త్వరలో కాల్స్ ట్యాబ్‌లో మిస్డ్ కాల్‌ల పేర్లను ఎరుపు రంగులో చూపుతుందని సమాచారం. దీని వలన వినియోగదారులు ఎవరి నుండి కాల్ మిస్ అయ్యారో గుర్తించడం సులభం అవుతుంది. ఈ ఫీచర్ కూడా టెస్టింగ్‌ దశలోనే ఉంది. ప్రస్తుతానికి బీటా టెస్టర్‌లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంది.