Site icon HashtagU Telugu

What is Bha : హమ్మయ్య.. చెప్పుల కష్టాలకు చెక్.. ‘భా’.. వచ్చేస్తోంది!

What Is Bha

What Is Bha

What is Bha : మన దేశంలో నేటికీ అమెరికా, బ్రిటన్‌  కాళ్ల సైజుల ఆధారంగానే చెప్పులు, షూస్‌ను తయారు చేస్తున్నారు.  అందుకే చాలామందికి భారతీయులకు ఆ సైజులు కరెక్టుగా సరిపోవడం లేదు. కొంచెం పెద్దగానో.. కొంచెం చిన్నగానో.. మొత్తం మీద అసౌకర్యంగానో ఉంటున్నాయి. అమెరికా, బ్రిటన్ వాళ్లతో పోలిస్తే మన కాళ్లు వెడల్పుగా ఉంటాయి. అంటే ఇన్నాళ్లుగా మనం ఇరుకు చెప్పులతో అడ్జస్ట్ అయిపోయాం. ఈవిధంగా మనం ఎదుర్కొంటున్న చెప్పుల సమస్యలకు త్వరలోనే చెక్ పడనుంది.  భారతీయుల కాళ్ల కొలతలతో సరికొత్త  ప్రామాణిక వ్యవస్థ అందుబాటులోకి రానుంది. దాని పేరే ‘భా’. భా అంటే భారత్‌ . భారత్ ఫుట్‌వేర్‌(What is Bha) సైజుల విధానాన్ని డెవలప్ చేసేందుకుగానూ దేశవ్యాప్తంగా ఇటీవల భారతీయుల పాదాల కొలతలపై సర్వే నిర్వహించారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ ఇండిస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) పరిధిలోని సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ) ఈ అధ్యయనాన్ని చేసింది.

We’re now on WhatsApp. Click to Join

సర్వే విశేషాలు.. 

Also Read :Papala Bhairavadu : రాజకీయ విమర్శనాస్త్రంగా ‘పాపాల భైరవుడు’.. పురాణాల్లో ఏముంది ?

భారత్ ఫుట్‌వేర్‌ సైజుల విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు ఎంతో సౌకర్యం కలుగుతుంది. ఇప్పటికే  ఈ సర్వే నివేదికను సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిపుణుల టీమ్ కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)కి సమర్పించింది. ఆ విభాగం బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌)కు ఈ సిఫార్సులను పంపింది. దేశంలో సైజుల విధానానికి అనుమతి తెలపడంతోపాటు దాన్ని అమలు చేసే అధికారం బీఐఎస్‌కే ఉంది. ప్రస్తుతం యూకే కొలతల ప్రకారం 10 సైజుల విధానం అమల్లో ఉండగా ‘భా’ వల్ల వాటి సంఖ్య 8కి తగ్గనుంది. దీనివల్ల ఇకపై అర సైజుల అవసరం తప్పనుంది. 2025 సంవత్సరం నుంచి భారత్ ఫుట్‌వేర్‌ సైజుల విధానం అమల్లోకి వస్తుందని అంటున్నారు.

Also Read :Padamati Kondallo:  ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్