Site icon HashtagU Telugu

Criminals Vs Buddhist Monks : నేరాలు చేశాక.. సన్యాసులుగా మారుతున్నారట!!

Criminals Vs Buddhist Monks

Criminals Vs Buddhist Monks

Criminals Vs Buddhist Monks : నేరం చేసిన కొందరు బౌద్ధ సన్యాసులుగా మారిపోయే ట్రెండ్ థాయ్‌లాండ్‌లో పెరుగుతోంది.. 

కొంతమంది తమను తాము శిక్షల నుంచి రక్షించుకునేందుకు ఇలా చేస్తున్నారంటూ  మీడియాలో కథనాలు వస్తున్నాయి.   

ఇలాంటి నేర చరితులు సన్యాసానికి తగిన వారు కాదని థాయ్‌ ప్రజలు వాదిస్తున్నారు.  

ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది ? 

గతవారం ఏం జరిగిందంటే.. ?

గతవారం థాయ్ లాండ్  రాజధాని  బ్యాంకాక్‌లోని ఓ పాఠశాలలో ఫైర్ డ్రిల్ సందర్భంగా మంటలను ఆర్పే పరికరం పేలింది. నలుగురు అగ్నిమాపక సిబ్బంది వైఫల్యం కారణంగా ఈ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మృతిచెందగా, 10 మంది గాయపడ్డారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిని శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇంతలో, నలుగురు అగ్నిమాపక సిబ్బంది కలిసి..  చనిపోయిన విద్యార్థి అంత్యక్రియల ప్రదేశం వద్దకు చేరుకున్నారు. వారు కాషాయ వస్త్రాలు ధరించి, గుండు చేయించుకొని ఉన్నారు. ఆ నలుగురూ ఒక్కసారిగా నేలపై మోకరిల్లారు. వాళ్ళు పశ్చాత్తాప సూచకంగా ఇలా చేశారు. ముందు నేరం చేయడం.. ఆ వెంటనే సన్యాసం పుచ్చుకోవడం(Criminals Vs Buddhist Monks) ఇదే ట్రెండ్  థాయ్ లాండ్  లో ఇప్పుడు నడుస్తోంది.

ధనిక వ్యాపారవేత్త.. ఇద్దరి మృతి.. సన్యాసం 

2019లో ఒక ధనిక వ్యాపారవేత్త తప్ప తాగి కారును డ్రైవ్ చేశాడు. అతడు కారును ఓవర్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టాడు. దీంతో ఆ ఇద్దరు  చనిపోయారు. ఈవిషయం తెలియడంతో ఆ వ్యాపారవేత్త బౌద్ధ  సన్యాసిగా మారిపోయాడు. వెంటనే ఆ రెండు బాధిత కుటుంబాలను కలిసి రూ.10కోట్ల పరిహారం ఇచ్చాడు.

Also read : 48 Died : దెయ్యం ట్రక్కు బీభత్సం.. 48 మంది మృతి

పోలీసు.. యాక్సిడెంట్.. సన్యాసం   

గతేడాది (2022 సంవత్సరంలో)  ఓ యువ పోలీసు బైక్ ను ఇష్టం వచ్చినట్టు నడిపాడు. అతడి బైక్ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. ప్రాయశ్చిత్తం కోసం ఆ పోలీసు.. సన్యాసి అయ్యాడు. అయితే ఆ పోలీసు.. బౌద్ధ  సన్యాసిగా మారడానికి తగినవాడు కాదని ప్రజలు వాదించారు. దీంతో అతడు సన్యాసం విడిచిపెట్టాడు.

మద్యం తాగి.. మాదకద్రవ్యాలు అమ్ముతూ 

2020లో థాయ్ లాండ్ లో ఒకచోట  లుయాంగ్ పు తువాంచై అనే బౌద్ధ  సన్యాసిపై మద్యం తాగి వాహనం నడపడం, మాదకద్రవ్యాలు కలిగి ఉండటం అనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. ఒక ట్రక్‌లో తిరుగుతూ అతడు డ్రగ్స్ అమ్మేవాడని పోలీసులు గుర్తించారు. అతడు పోలీసులకు దొరకగానే వైద్య పరీక్షలు చేయించగా..  రక్తంలో ఆల్కహాల్ స్థాయి  అధిక మోతాదులో ఉందని తేలింది.  డజన్ల కొద్దీ మెథాంఫేటమిన్ మాత్రలను కూడా ఆ సన్యాసి నుంచి స్వాధీనం చేసుకున్నారు. స్థానిక యువకులకు వాటిని బౌద్ధ  సన్యాసి లుయాంగ్ పు తువాంచై విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.