Chhatrapati Shivaji : ఛత్రపతి శివాజీ.. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు. ఆయన 394వ జయంతి నేడే. శివాజీ 1630 సంవత్సరం ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం వద్దనున్న శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. ఆయన మహారాష్ట్రలోని భోస్లే కులానికి చందినవారు. మొగల్ రాజులతో శివాజీ ఎంతో వీరోచితంగా పోరాడారు. అందుకే ఆ యోధుడి జయంతిని దేశ వ్యాప్తంగా వేడుకలా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక పండుగలా నిర్వహిస్తారు. ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji) జీవితంతో ముడిపడిన కొన్ని ఆసక్తికర విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
శివాజీ – పేరు
శివాజీ తల్లి జిజియా బాయి క్షత్రియ వంశానికి చెందిన ఆడ పడుచు. శివాజీ పుట్టడానికి ముందు ఆమెకు కలిగిన సంతానమంతా మృతిచెందారు. దీంతో ఆమె శివై పార్వతిని పూజించగా.. వరప్రసాదంగా శివాజీ జన్మించాడు. దీంతో ఆయననకు శివాజీ అనే పేరు పెట్టుకున్నారు.
శివాజీ – మతం
శివాజీకి హిందూ మత బోధనలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. ఎక్కువగా హిందూ సాధువులతో ఆయన సమయాన్ని వెచ్చించేవారు. సహజంగా శివాజీ భవానీ దేవి భక్తుడు. హిందూ దేవాలయాలు మాత్రమే కాకుండా.. ఎన్నో మసీదులను కూడా శివాజీ కట్టించారు. ఆయన సైన్యంలో మూడొంతలు ముస్లింలే ఉండేవారు. హైదర్ అలీ, ఇబ్రహీం ఖాన్, సిద్ధి ఇబ్రహీం వంటివారు శివాజీ సైన్యంలో కీలక పదవుల్లో ఉండేవారు.
Also Read : DL1 CJI 0001 : సీజేఐ చంద్రచూడ్ కారు నంబర్ వైరల్.. ఎందుకు ?
శివాజీ – పాలన
ఛత్రపతి శివాజీ యుద్ధతంత్రాలలో మాత్రమే కాకుండా.. పరిపాలనా విధానంలో కూడా అగ్రగణ్యుడు. తన రాజ్యంలో మంత్రిమండలి, విదేశాంగ విధానంతోపాటు, గూడఛారి వ్యవస్థను కూడా ఆయన ఆనాడే ఏర్పాటు చేశారు. ప్రజల ప్రభువుగా పరిపాలన చేస్తూ.. వ్యక్తిగత విలాసాలకు శివాజీ ఎన్నడూ తావు ఇవ్వలేదు.
Also Read : Shankar: అతన్ని రెండవ వివాహం చేసుకోబోతున్న డైరెక్టర్ శంకర్ కూతురు.. ఘనంగా నిశ్చితార్థం?
శివాజీ – యుద్ధం
- శివాజీ 17 ఏళ్ళ వయసులో మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్లలో కొండన, రాజ్ ఘడ్ కోటలను సొంతం చేసుకొని.. పూణే ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.
- 1664 నాటికి గుజరాత్లోని సూరత్ నగరం ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉండేది. దీంతో శివాజీ ఆ నగరంపై దాడి చేసి ధనంతోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వేలాదిమందిని తన సైన్యంలో చేర్చుకున్నారు. తర్వాత మొఘలుల, బీజాపూర్ సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా తన సొంతం చేసుకున్నారు.
- ఛత్రపతి శివాజీ తుదిశ్వాస విడిచే సమయానికి 300 కోటలు ఆయన అధీనంలో ఉండేవి. కొండ ప్రాంతాలలో సాంకేతిక విలువలతో కోటలను నిర్మించడం శివాజీకి అలవాటు. దాదాపు 300 కోటలను ఆయన నిర్మించారు.
- అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ నుంచి మెరికల్లాంటి 10వేల మంది కిరాయి సైనికులను మహారాష్ట్రకు పిలిపించి శివాజీని అంతమొందించేందుకు బీజాపూర్ సుల్తాన్ కుట్ర పన్నాడు. అయితే శివాజీ 5వేల మంది మరాఠా యోధులతో కలిసి కొల్హాపూర్ వద్ద వాళ్లందరినీ వీరోచితంగా ఎదుర్కొన్నాడు. ఆ యుద్ధంలో ‘హర హర మహాదేవ్’ అని శివాజీ పలుకుతూ.. యుద్ధంలో విజృంభించి విజయం సాధించాడు.
- గెరిల్లా యుద్ధ వ్యూహాలకు ఛత్రపతి శివాజీ ఆనాడు చాలా పేరొందారు.
- 1660లో ఔరంగజేబు తన మేనమామ అయిన షాయిస్తా ఖాన్కు లక్షకుపైగా సుశిక్షుతులయిన సైన్యాన్ని, ఆయుధాలను అందించి శివాజీని ఓడించి దక్కన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని రమ్మని పంపించాడు. బలమైన షాయిస్తా ఖాన్ సేన ముందు శివాజీ సేన తల వంచక తప్పలేదు. శివాజీ ఓటమి అంగీకరించి పూణే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అనంతరం పూణేలో శివాజీ నిర్మించిన లాల్ మహల్లో షాయిస్తా ఖాన్ నివాసం ఏర్పర్చుకున్నాడు.