Expensive Electric Cars : దేశంలో ఖరీదైన ఎలక్ట్రిక్ కార్ల విశేషాలివీ..

Expensive Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ జూమ్ అవుతోంది. వాటి సేల్స్ రెక్కలు తొడుగుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 01:52 PM IST

Expensive Electric Cars : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ జూమ్ అవుతోంది. వాటి సేల్స్ రెక్కలు తొడుగుతున్నాయి. రిచ్ క్లాస్‌కు చెందినవారు లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల రేటు ఎంతైనా కొనేందుకు వెనుకాడటం లేదు. అందుకే పెద్దపెద్ద కార్ల కంపెనీలు హంగు ఆర్భాటాలతో, కొత్తకొత్త ఫీచర్లతో సరికొత్త మోడల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్నాయి. రోల్స్ రాయిస్, లోటస్, బీఎండబ్ల్యూ, బెంజ్, పోర్షే వంటి టాప్ క్లాస్  కంపెనీల కార్ల(Expensive Electric Cars) ధరలు, వాటి ప్రత్యేకతలపై ఒక లుక్ వేద్దాం.

We’re now on WhatsApp. Click to Join

రోల్స్ రాయిస్ స్పెక్టర్ 

  • రోల్స్ రాయిస్ ‘స్పెక్టర్’(Rolls Royce Spectre).. ఇది మనదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు. దీని ధర రూ.7.5 కోట్లు.
  • ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారులో 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కలిగి ఉంటుంది. 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది
  • అదనంగా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్‌ను కూడా ఈ కారుతో పాటు ఇస్తారు.  ఇది 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి  95 నిమిషాల టైం తీసుకుంటుంది.
  • ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
  • స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

లోటస్ ఎలెట్రే 

  • లోటస్ అనేది బ్రిటీష్ కార్ల కంపెనీ.
  • లోటస్ కంపెనీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎలెట్రే(Lotus Eletre)ను మనదేశంలో లాంచ్ చేసింది.
  • దీని ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల మధ్య ఉంటుంది.
  •  ఈ కారు ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
  • ఈ కారులో 112 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఈ కారు 20 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
  • ఈ కారు 490 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
  • లోటస్ ఎలెట్రే 2.95 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

బీఎండబ్ల్యూ ఐ7 

  • జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7) మోడల్ కారును రిలీజ్ చేసింది.
  • ఇది ఎలక్ట్రిక్ సెడాన్ కారు.
  • ఈ కారు ధర రూ.2.03 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంటుంది.
  • ఎక్స్‌డ్రైవ్60, ఎం70 ఎక్స్‌డ్రైవ్ మోడళ్లలో దీన్ని కొనొచ్చు.
  • ఈ కారులో 101.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఈ కారు 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
  • ఈ కారు 625 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.
  • 3.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకుంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఈక్యూఎస్ 

  • మెర్సిడెస్ బెంజ్ కంపెనీ  ఏఎంజీ ఈక్యూఎస్‌ (Mercedes Benz AMG EQS) అనే ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది.
  • ఈ కారు ధర రూ.2.44 కోట్లుగా (ఎక్స్ షోరూం) ఉంది.
  • ఇందులో 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది.
  • ఈ కారు 580 కిలోమీటర్ల రేంజ్‌ కలిగి ఉంటుంది.
  • ఈ కారు 3.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

పోర్షే టేకాన్ 

  • లగ్జరీ కార్ల కంపెనీ పోర్షే.. పోర్షే టేకాన్ (Porsche Taycan) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది.
  • దీని ధర 1.61 కోట్ల నుంచి రూ.2.44 కోట్ల మధ్య ఉంటుంది.
  • ఈ కారు మూడు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది.
  • ఈ కారు 431 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కలిగి ఉంటుంది.
  • 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్లో 321.84 బీహెచ్‌పీ, 616.87 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండూ 452 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తాయి.

ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ

  • ఆడీ కంపెనీ నుంచి  ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ (Audi RS E Tron GT) అనే ఎలక్ట్రిక్ కారు రిలీజైంది.
  • దీని ధర రూ.1.94 కోట్లు.
  • ఒక్క వేరియంట్లోనే ఈ కారు అందుబాటులో ఉంది.
  • ఇందులో 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఈ కారు 636 బీహెచ్‌పీ పవర్‌ను, 830 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు.
  • ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ 481 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

Also Read : India – US – NPCI : గుడ్ న్యూస్.. భారత్ – అమెరికా బ్యాంకుల మధ్య ‘పేమెంట్’ సర్వీస్ ?