Womens Day : మ‌హిళాదినోత్స‌వం ప్ర‌త్యేక‌త‌ ఇదే.!

ప్రతీ ఏడాద‌తి మార్చి 8న మ‌హిళాదినోత్సవాన్ని జ‌రుపుతారు. తొలుత‌ ఆ రోజును అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు.

  • Written By:
  • Publish Date - March 7, 2022 / 03:44 PM IST

ప్రతీ ఏడాద‌తి మార్చి 8న మ‌హిళాదినోత్సవాన్ని జ‌రుపుతారు. తొలుత‌ ఆ రోజును అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా, పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో ఇది మిళితమైంది. ఐక్యరాజ్యసమితి ఉద్దేశించిన విధంగా రాజకీయ, మానవీయ హక్కులు బలంగా వుండేలా ప్రపంచవ్యాప్తంగా జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ రోజును కొంతమంది వంకాయ రంగు రిబ్బనులు ధరించి ఆచరిస్తారు. ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. 1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.

1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8).ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం, రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే ‘బ్రెడ్డు, శాంతి’ డిమాండుగా వ్యవహరించారు. లియోన్ ట్రోస్కీ ప్రకారం, ‘ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అదే విప్లవానికి తొలి అడుగులులు.అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.

1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు, ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది. 2011 మార్చి 8 న ఈ దినోత్సవ వేడుకలు 100 వసంతాలు పూర్తి చేసుకున్నాయి .యు.యస్.లో అధ్యక్షుడు బరాక్ ఒబామా 2011 మార్చిని “మహిళల చారిత్రక మాసం”గా ప్రకటించారు. దేశ చరిత్ర నిర్మాణంలో మహిళల పాత్రని గుర్తించాలని అమెరికన్లకు పిలుపునిచ్చారు. రాజ్య కార్యదర్శి హిల్లరీ క్లింటన్ ఈ సందర్భంగా “100 మహిళల ఇన్షియేటివ్: అంతర్జాతీయ ఎక్స్చేంజెస్ ద్వారా మహిళలు , బాలికల సాధికారత”, ఈ దినోత్సవాన్ని పునస్కరించుకుని ప్రారంభించారు. ఇదే సందర్భంలోనే ఐసిఆర్సి ICRC మహిళలపై జరుగుతున్న అత్యాచార, లైంగిక వేధింపులని అరికడుతూ తీసుకుంటున్న నివారణ చర్యలపై ఎటువంటి జాప్యం చేయకూడదని తమ రాజ్యాలకు పిలుపునిచ్చారు. పాకిస్థాన్లో పంజాబ్ ప్రభుత్వం వారు గుజ్రాన్ వాలా లింగ సంస్కరణా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2011 మహిళా దినోత్సవాన్ని గిఫ్ట్ యూనివర్సిటీ గుజ్రాన్ వాలాలో ఘనంగా నిర్వహించారు. శ్రీమతి షాజియా అష్ఫాగ్ మత్తు, జి.ఆర్.ఎ.పి. అధికారి ఈ వేడుకల్ని చక్కగా నిర్వహించారు. ఆస్ట్రేలియా ఈ సందర్భంగా 20 సెంట్ల నాణేన్ని 100 వసంతాల మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసింది.

ఈజిప్ట్ లో మాత్రం ఈ దినం విషాదాన్నే మిగిల్చింది. తాహిర్ స్వ్కేర్ లో హక్కుల కోసం నినదీస్తున్న మహిళల్ని పురుష సమూహాలు చెదరగొట్టాయి. ఇదంతా పోలీసు, మిలిటలీ బలగాల కళ్ళెదుటే జరిగింది. హదీల్-ఆల్-షల్సీ ఎ.పి.కి రిపోర్టు రాస్తూ ఆ సంఘటనని ఇలా వర్ణించారు- ” బురఖాలలో జీన్స్ లలో వివిధ దుస్తుల్లో ఉన్న మహిళలు కైరో సెంట్రల్ లోని తాహిర్ స్వ్కేర్ కి మహిళా దినోత్సవం జరుపుకోవడానికి చేరుకున్నారు. కానీ అధిక సంఖ్యలో పురుష మూకలు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ “గ్రామీణ మహిళా స్వశక్తీకరణ –ఆకలి పేద రిక నిర్మూలన”ని థీమ్ గా ఎంచుకుంది. 2012 మహిళా దినోత్సవం సందర్భంగా ఐ.సి.ఆర్.సి. వారు, సైనిక దళాల్లో చనిపోయిన వారి తల్లుల భార్యల సంక్షేమానికి కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇలా సైనికుల్లో తప్పిపోయిన వారి మహిళలకు సమాజంలో చాలా ఆర్థిక , సామాజిక సమస్యలు ఎదురవుతుంటాయి. ఐ.సి.ఆర్.సి. వారు, తప్పిపోయిన వారి ఆచూకి వారి కుటుంబ సభ్యులకి తెలపడం చాలా ముఖ్యమని నొక్కి వక్కాణినించారు 2012 అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీమ్ మీద వేయబడిన గూగుల్ డూడుల్ పెట్టింది. 2013 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా, ఐ.సి.ఆర్.సి. వారు (అంతర్జాతీయ రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ ) జైలులో మగ్గుతున్న మహిళల సమస్యల మిద ఉద్గాటించారు.

2014 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
యునైటెడ్ నేషన్స్ “మహిళా సమానత్వమే అందరికీ హితం” అనే థీమ్ ని 2014 మహిళా దినోత్సవానికి ఎంచుకుంది.
2015 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, కార్యకర్తలు బీజింగ్ డిక్లరేషన్, ప్లాట్‌ఫామ్ ఫర్ యాక్షన్ యొక్క 20 వ వార్షికోత్సవ సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, ఇది మహిళల హక్కులను సాకారం చేసే ఎజెండాను నిర్దేశించిన చారిత్రాత్మక రోడ్‌మ్యాప్.
2016 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ, “అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, భారత మహిళలకు నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశ నిర్మాణంలో సంవత్సరాలుగా వారు చేసిన కృషికి కృతజ్ఞతలు.” అనే సందేశాన్నిచ్చాడు. దేశవ్యాప్తంగా ఇప్పటికే పనిచేస్తున్న ఎనిమిది వన్ స్టాప్ సంక్షోభ కేంద్రాలకు అదనంగా మార్చి 8 న మరో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది . మహిళా దినోత్సవానికి ముందు, జాతీయ ప్రయాణ ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా, ప్రపంచంలోనే అతి పొడవైన నాన్-స్టాప్ ఫ్లైట్ నడిపింది. ఇది ఢిల్లీ నుండి సాన్‌ఫ్రాన్సిస్కోకు సుమారు 17 గంటల్లో 14,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.
2017 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
రష్యన్ విప్లవానికి 2017 నాటికి శతాబ్ద కాలం పూర్తవుతుంది. 1917 మార్చి 8 లో రష్యన్ మహిళలు బ్రెడ్డు కొరత గురించి సెయింట్ పీటర్స్బెర్గ్ వీధులలో నినదించారు. ఈ సంఘటనలు రెండవ సార్ నిచోలాస్ అభ్యంతరం వలన మార్చి 15న ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు 2017 మార్చి 8 నాటికి ఇవన్ని పుంజుకోవాలని యోచిస్తున్నారు. వారిలో యుక్రేనియన్ మహిళా కార్యాచరణ సంఘం ఫెమెన్ ముఖ్యమైనది. వారి ముఖ్య ఉద్దేశం మహిళల్ని ఉత్తేజితుల్క్ని చేయడం; సామాజిక పథంలో పాల్గొనేలా చేయడం; ఒక విప్లవం లోకి తీసుకు రావడం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ వర్కర్స్ మిద ఒక స్ట్రైక్ జరపాలని ప్రపంచంలో పలు యూనియన్లు నిర్ణయించాయి.
2019 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం యునైటెడ్ నేషన్స్ ఇతివృత్తం: ‘సమానంగా ఆలోచించండి, నేర్పుతో నిర్మించండి, మార్పు కోసం కొత్త కల్పనలు చేయండి.’ ఈ ఇతివృత్తం యొక్క దృష్టి లింగ సమానత్వం, మహిళల సాధికారత. ముఖ్యంగా సామాజిక రక్షణ వ్యవస్థలు, ప్రజా సేవలకు ప్రాప్యత, స్థిరమైన మౌలిక సదుపాయాలలో అభివృద్ధి చెందడానికి వినూత్న మార్గాలపై ఉంది. ఫెడరల్ స్టేట్ ఆఫ్ బెర్లిన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మొదటిసారి ప్రభుత్వ సెలవు దినంగా గుర్తించింది.
2020 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఐక్యరాజ్యసమితి ఇతివృత్తం : ‘నేను జనరేషన్ సమానత్వం’: మహిళల హక్కులను గ్రహించడం ‘. కోవిడ్ – 19 మహమ్మారి ఉన్నప్పటికీ, లండన్, పారిస్, మాడ్రిడ్, బ్రస్సెల్స్, మాస్కో, ఇతర యూరోపియన్ నగరాల్లో వీధి కవాతులు జరిగాయి. ఇస్లామాబాద్‌లోని ఔరత్ మార్చ్‌ రాళ్ల దాడి వల్ల దెబ్బతింది. దీనిని ఇస్లామిక్ అని నిషేధించే ప్రయత్నం విఫలమైంది. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెకెక్ లో ముసుగు వేసుకున్న పురుషులు కవాతుపై దాడి చేసిన కొద్దిసేపటికే పోలీసులు డజన్ల కొద్దీ కవాతులను అదుపులోకి తీసుకున్నారు.
2021 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం 2021 ఐక్యరాజ్య సమితి ఇతివృత్తం “నాయకత్వంలోని మహిళలు: కోవిడ్-19 ప్రపంచంలో సమాన భవిష్యత్తును సాధించడంపై జ‌రిగింది. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలికలు, మహిళలు ఆరోగ్య సంరక్షణ కార్మికులు, సంరక్షకులు, ఆవిష్కర్తలు, సమాజ నిర్వాహకులుగా చూపిన ప్రభావాన్ని ఎత్తిచూపారు.
2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఈ ఏడాది అంతర్జాతీయ మహిళాదినోత్సవం థీమ్ #BreakTheBias – Imagine a gender equal world అంటే లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనది.