Artificial Womb : కృత్రిమ గర్భం.. నెలలు నిండని శిశువుల కోసం రెడీ

Artificial Womb : 9 నెలలు నిండకుండానే పుట్టే శిశువులను మనం చూస్తుంటాం..ఇలా పుట్టిన పిల్లలను వెంటనే తల్లి కడుపు తరహా వాతావరణంలో ఉంచితే మంచిదని స్పెయిన్ శాస్త్రవేత్తలు భావించారు.  అందుకోసం వారు  కృత్రిమ గర్భం మోడల్ ను తయారు చేశారు. 

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 10:38 AM IST

Artificial Womb : 9 నెలలు నిండకుండానే పుట్టే శిశువులను మనం చూస్తుంటాం..

అలాంటి శిశువులు వీక్ గా ఉంటారు.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు..   

తల్లి కడుపులో పూర్తికాలం ఉండకపోవడంతో ఈ బలహీనత చుట్టుముడుతుంది. 

ఇలా పుట్టిన పిల్లలను వెంటనే తల్లి కడుపు తరహా వాతావరణంలో ఉంచితే మంచిదని స్పెయిన్ శాస్త్రవేత్తలు భావించారు. 

అందుకోసం వారు  కృత్రిమ గర్భం మోడల్ ను తయారు చేశారు. 

బార్సిలోనా సిటీలో ఉన్న BCNatal మెడికల్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు కృత్రిమ గర్భం (Artificial Womb) మోడల్ ను డెవలప్ చేశారు. మానవ శరీరానికి ఎలాంటి హాని చేయని బయో కంపాటిబుల్ పదార్థంతో కృత్రిమ గర్భం బాక్స్ ను తయారు చేశారు. ఇది 6 నెలలు లేదా అంతకంటే ముందే పుట్టిన శిశువుల శరీర భాగాలు అభివృద్ధి చెందేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. 40 వారాల గర్భకాలం (డెలివరీ టైం)  నాటికి.. గర్భ సంచిలో 600 మిల్లీలీటర్ల ఉమ్మ నీరు మధ్యలో శిశువు ఉంటుంది. 40 వారాల కంటే ముందే పుట్టిన శిశువులు ఆ వాతావరణాన్ని తిరిగి పొందే  పరిస్థితి తాము డెవలప్ చేసిన కృత్రిమ గర్భంలో ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Also read : First Flying Car : ఎగిరే కారుకు గ్రీన్ సిగ్నల్.. ట్రాఫిక్ జామ్ కు బైబై

ఈ కృత్రిమ గర్భం బాక్స్..  కృత్రిమంగా శాస్త్రవేత్తలు సిద్ధం చేసే ఉమ్మ నీరు వ్యవస్థతో లింక్ అయి ఉంటుంది. ఈ ఉమ్మ నీరు .. శిశువును బయటి వాతావరణం ప్రభావం నుంచి వేరుచేసి అల్ట్రాసౌండ్ కంట్రోల్ లోకి తెస్తుంది. ఫలితంగా డాక్టర్స్ ఆ కృత్రిమ గర్భం బాక్స్ లో ఉంచిన నవజాత శిశువు హెల్త్ ను ఎప్పటికప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా ట్రాక్ చేసే వెసులుబాటు కలుగుతుంది. ప్రీ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా నెలలు నిండకుండానే పుట్టిన గొర్రె పిల్లలను ఈ కృత్రిమ గర్భం బాక్స్ లో 12 రోజులు ఉంచగా.. వాటి ఆరోగ్య పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యాయి. తదుపరిగా నెలలు నిండని పంది పిల్లలను ఈ బాక్స్ లో ఉంచి ప్రయోగ పరీక్షలు చేయనున్నారు..  అవి కూడా సక్సెస్ అయితే  నేరుగా మనుషులపై ట్రయల్స్ చేస్తారు.

Also read : Bill Gates Office : పోర్న్ చూస్తావా.. వివాహేతర సంబంధం ఉందా.. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలట : వాల్ స్ట్రీట్ జర్నల్