Site icon HashtagU Telugu

Sania Mirza in India Cricket: వుమెన్స్ ఐపీఎల్ లో సానియా మీర్జా

Sania Mirza appointed as mentor of RCB women's team..!

Rcb

మీరు చదివింది కరెక్టే.. మహిళల ఐపీఎల్ లోకి సానియా మీర్జా (Sania Mirza) ఎంట్రీ ఇవ్వనుంది. అదేంటి సానియా టెన్నిస్ ప్లేయర్ కదా..క్రికెట్ లోకి అడుగు పెట్టబోతుందా అనుకుంటున్నారా.. అదేమీ లేదు సానియా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తుంది..ప్లేయర్ గా కాదు మెంటర్ గా.. ఆమెను తమ జట్టుకు మెంటర్ గా నియమిస్తున్నట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రకటించింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది.తమ కోచింగ్‌ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుందనీ, అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు తమ మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించి సానియాని ఎంపిక చేసుకున్నట్టు తెలిపింది. ఛాంపియన్‌ అథ్లెట్‌, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన సానియాకు తమ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సానియా మీర్జా అంటూ ట్వీట్ చేసింది.

కాగా తన కొత్త రోల్ పై సానియా మీర్జా (Sania Mirza) సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఆఫర్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. కొత్త బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. గత 20 ఏళ్లుగా తాను ప్రోఫెషనల్ ప్లేయర్‌గా రాణించానని, ఇప్పుడు ఆర్‌సీబీ మెంటార్‌గా ప్లేయర్లకు అండగా ఉంటూ.. వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చింది. సానియా ఇటీవలే తన ప్రొఫెషనల్ కెరీర్ కు గుడ్ బై చెప్పింది. మరోవైపు సానియా మీర్జా నియామకంపై ఆర్‌సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీని తీసుకుంది.

Also Read:  Yamunotri: యమునోత్రి వెళ్లే భక్తులకు కష్టాలు తీరిపోనున్నాయి!