PM Vishwakarma Scheme : చేతివృత్తుల వారికి చేదోడునిచ్చే లక్ష్యంతో ప్రారంభించిన ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా అప్లికేషన్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కీమ్ ద్వారా లోన్స్ సహా అన్ని రకాల ప్రయోజనాలను పొందడానికి 18 చేతివృత్తుల వారు అప్లై చేస్తున్నారు. దీని ద్వారా ఎంపిక చేసే వారికి శిక్షణ ఇప్పించి.. బ్యాంకుల ద్వారా లోన్ మంజూరు చేస్తారు. తొలుత టూల్ కిట్స్ కోసం రూ.15 వేల ఆర్థిక సాయం ఇస్తారు. ఆ తర్వాత తక్కువ వడ్డీకే లోన్లను కూడా శాంక్షన్ చేస్తారు. ‘పీఎం విశ్వకర్మ’ స్కీం కోసం ఇప్పటికే కోటీ 6 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిల్లో 30 లక్షలకుపైగా అప్లికేషన్లు స్టేజీ-1 వెరిఫికేషన్ (గ్రామపంచాయతీ స్థాయిలో)ను పూర్తి చేసుకున్నాయి. స్టేజీ-2 కింద 12 లక్షలకుపైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. స్టేజీ-3లో 4 లక్షలకుపైగా దరఖాస్తుల స్క్రీనింగ్ కమిటీ వెరిఫికేషన్ జరిగింది. 4.41 లక్షల మంది విజయవంతంగా ఈ స్కీమ్(PM Vishwakarma Scheme) కోసం రిజిస్టర్ చేసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ చేతివృత్తుల వారు అర్హులు
దర్జీలు, వడ్రంగులు, పడవలు తయారు చేసేవారు, ఆయుధాలు తయారు చేసేవారు, ఇనుప పరికరాలు చేసే వారు, కమ్మరి, ఇంటి తాళాల తయారీదారులు, కుమ్మరి, స్వర్ణకారులు, విగ్రహాల తయారీదారులు, చెప్పులు కుట్టేవారు, తాపీ పనిచేసేవారు, సంప్రదాయ బొమ్మలు చేసేవారు, క్షురకులు, పూలదండలు చేసేవారు, రజకులు, చేప వలల తయారీదారులు ‘పీఎం విశ్వకర్మ’ పథకం ద్వారా ప్రయోజనాలను పొందొచ్చు. 18 ఏళ్ల వయసు దాటిన వాళ్లు అప్లై చేయొచ్చు. అంతకుముందు ఐదేళ్లలో ఇలాంటి స్కీమ్స్‌లో లోన్ తీసుకోనివారు అర్హులు. ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేసేవారు, వారి కుటుంబ సభ్యులు అనర్హులు.
Also Read : Indian Coast Guard : ఇంటర్‌తో గవర్నమెంట్ జాబ్.. నెలకు 50వేలకుపైనే శాలరీ
లోన్స్ మంజూరు చేసేది ఇలా..
- ‘పీఎం విశ్వకర్మ’ స్కీమ్‌కు అప్లై చేసుకునే వారికి కేంద్ర సర్కారు విశ్వకర్మ సర్టిఫికెట్ సహా ఐడీ కార్డును అందిస్తుంది.
- తొలుత 5-7 రోజులు (40 గంటలు) ఫ్రీ బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. రోజుకు రూ. 500 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది.
- ఆసక్తి ఉన్న వారు 15 రోజుల అడ్వాన్స్డ్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ట్రైనింగ్‌లో రోజుకు రూ. 500 సహా ట్రైనింగ్ తర్వాత టూల్ కిట్ (పరికరాలు, పనిముట్లు) కొనుగోలు చేసేందుకు రూ. 15 వేలు ఆర్థిక సాయంగా అందిస్తుంది.
- మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోన్ పొందొచ్చు. దీనిని 18 నెల్లలో చెల్లించాల్సి ఉంటుంది. ఇది చెల్లిస్తే మరో రూ.2 లక్షల లోన్ ఇస్తారు. దీన్ని 30 నెలల్లో చెల్లించాలి. సొంతంగా షాప్ పెట్టుకునేందుకు ఈ లోన్లు ఉపయోగపడతాయి.
- అప్లై చేయడానికిగానూ పీఎం విశ్వకర్మ పథకం వెబ్సైట్ https://pmvishwakarma.gov.in/ లోకి వెళ్లాలి. మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. తర్వాత ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ ఫారం నింపి సబ్మిట్ చేయాలి.