30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్‌కు 30 నిమిషాల్లోనే చికిత్స

30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్ సమస్య చాలామందిని ఇబ్బందిపెడుతోంది.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 02:01 PM IST

30 Minutes Treatment : బ్రెయిన్ ట్యూమర్ సమస్య చాలామందిని ఇబ్బందిపెడుతోంది. జీవితాలను నరక రూపంలోకి మారుస్తోంది. ఇప్పటివరకు బ్రెయిన్ ట్యూమర్ ప్రాబ్లమ్‌కు సర్జరీ ఒక్కటే చికిత్స. దానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ డబ్బు ఖర్చవుతుంది. పేషెంట్ రికవరీలో చాలా సవాళ్లు ఎదురవుతుంటాయి. ఈ అవాంతరాలన్నీ అధిగమించే అధునాతన టెక్నాలజీ అందు బాటులోకి వచ్చింది. అదే.. ‘‘ZAP-X గైరోస్కోపిక్ రేడియో సర్జరీ ప్లాట్‌ఫామ్’’!! దీన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ టెక్నాలజీ ద్వారా 30 నిమిషాల్లోనే(30 Minutes Treatment) బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స చేయొచ్చు. బ్రెయిన్ ట్యూమర్ రోగులు అరగంట నిడివి కలిగిన ట్రీట్‌మెంట్ సెషన్లలో పాల్గొంటే సరిపోతుంది.

We’re now on WhatsApp. Click to Join

ZAP-X అనేది నాన్-ఇన్వాసివ్, పెయిన్-ఫ్రీ ట్రీట్‌మెంట్ పద్ధతి. దీనివల్ల రోగులకు చికిత్స చేసే టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. ZAP-X ఒక ఔట్ పేషెంట్ విధానం. దీనితో  ట్రీట్‌మెంట్ తీసుకున్న రోగులు అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు. ఆస్పత్రిలో ఉండటం, అనస్థీషియా అవసరమయ్యే సంప్రదాయ శస్త్రచికిత్సలతో పోలిస్తే ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ZAP-X  చికిత్స సమయంలో రోగులు చాలా తక్కువ రేడియేషన్‌కు గురవుతారు. రేడియేషన్ లీకేజీని తగ్గించే సేఫ్టీ ఫీచర్లు ఈ మెడికల్ టెక్నాలజీలో ఉన్నాయి.  ZAP-X చికిత్స చేసే క్రమంలో ఆరోగ్యకరమైన మెదడు కణజాలం దెబ్బతినే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. కేవలం కణితిపై కచ్చితంగా దృష్టి పెట్టి ట్రీట్మెంట్  కొనసాగుతుంది. దీనివల్ల రోగి మెదడు సేఫ్‌గా ఉంటుంది.

Also Read : Salary Hike : బ్యాంకు ఉద్యోగులకు 17 శాతం జీతం పెంపు.. త్వరలోనే మరో శుభవార్త

‘‘మెదడులోని కణాలు అసాధారణంగా పెరగడాన్ని ‘బ్రెయిన్ ట్యూమర్’ అంటారు. మొబైల్ ఫోన్ వినియోగం, కొన్ని రకాల కెమికల్స్ ప్రభావం, హార్మోన్ల అసమతుల్యత వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంటుంది’’