Site icon HashtagU Telugu

Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

Sonic Rocket Vs Monkey Problem

Sonic Rocket Vs Monkey Problem

Sonic Rocket Vs Monkey Problem : కోతుల బెడద గురించి స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కోతుల వల్ల ఎదురయ్యే ప్రాబ్లమ్స్ పై అందరికీ మంచి అవగాహన ఉంది. ఈ అవగాహనతో ఒక సైంటిస్టు వినూత్న పరిష్కార మార్గాన్ని కనుగొన్నాడు.  పంజాబ్ లోని మొహాలీలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండర్ రీసెర్చ్ (IISERM)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న శాస్త్రవేత్త డాక్టర్ సామ్రాట్ ఘోష్ ప్లాస్టిక్ బాటిళ్లతో సోనిక్ రాకెట్‌ను రూపొందించారు. దీనికి ‘నీల్‌ గగన్’ అని పేరు పెట్టారు. ఈ ప్లాస్టిక్ రాకెట్లను గాల్లోకి వదిలినప్పుడు.. వాటి నుంచి  బుల్లెట్ షాట్ల తరహాలో శబ్దాలు వస్తాయి. ఈ ప్లాస్టిక్ బాటిళ్ల రాకెట్‌ను అరవై అడుగుల దూరం దాకా గురిపెట్టి వేయొచ్చు. వాస్తవానికి 2017లోనే సామ్రాట్ ఘోష్ ఈ రాకెట్‌ను రూపొందించారు. ప్రయోగాత్మకంగా తొలుత నీల్ గగన్ సోనిక్ రాకెట్లను  హిమాచల్ ప్రదేశ్ లోని యాపిల్ తోటల రైతులకు ఆయన అందించారు.

Also read : Telangana – BC Survey : వచ్చే నెల నుంచి తెలంగాణలో ‘బీసీ సర్వే’.. ఎందుకంటే ?

1992-98 మధ్యకాలంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి పీహెచ్‌డీ చేసిన ఘోష్.. ఆ టైంలో తాను చేసిన రీసెర్చ్ లో భాగంగా రూపొందించిన ఒక ఫార్ములా ఆధారంగా కోతులను తరిమికొట్టే నీల్ గగన్  రాకెట్లను తయారు చేశారు. ఐఐటీ బాంబేలో ఎమ్మెస్సీ ఫిజికల్ కెమిస్ట్రీ చదివిన ఘోష్.. చాలాకాలం పాటు అమెరికా, కెనడా, జర్మనీల్లోనూ పని చేశారు. ఢిల్లీలోని నేషనల్ సైన్స్ సెంటర్ నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెయిర్‌లో సామ్రాట్ ఘోష్  రూపొందించిన నీల్ గగన్‌కు మొదటి బహుమతి లభించింది. నీల్ గగన్ పై పేటెంట్ హక్కుల కోసం కూడా ఘోష్ (Sonic Rocket Vs Monkey Problem) అప్లై చేసుకున్నారు.