Site icon HashtagU Telugu

Google Driverless Car : గూగుల్ డ్రైవర్ లెస్ కారుకు నిప్పు.. అసలేం జరిగింది ?

Driverless Car

Driverless Car

Google Driverless Car : అమెరికాలో ప్రస్తుతం సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను టెస్ట్ చేస్తున్నారు. ఈ కార్లను డెవలప్ చేస్తున్న కంపెనీల జాబితాలో టెస్లా, గూగుల్ సహా వివిధ కంపెనీలు ఉన్నాయి. తాజాగా గూగుల్ (ఆల్ఫాబెట్) కంపెనీకి చెందిన ‘వేమో’  డ్రైవర్ రహిత సెల్ఫ్ డ్రైవింగ్ కారును శాన్ ఫ్రాన్సిస్కోలోని చైనా టౌన్ ప్రాంతంలో ట్రయల్ కోసం పంపింది. అదొక తెలుపు రంగు స్పోర్ట్ యుటిలిటీ కారు. ఇది బయలుదేరిన కాసేపటికే అదుపు తప్పింది.  దీంతో అక్కడున్న వారు కోపోద్రిక్తులు అయ్యారు. కొంతమంది ఆ డ్రైవర్ రహిత కారుపైకి ఎక్కి దాని విండ్‌షీల్డ్‌ను పగలగొట్టారు. ఆ తర్వాత కారు లోపలికి బాణసంచా విసిరి..  నిప్పు పెట్టారు.  ఇదంతా చూస్తూ.. చుట్టూ ఉన్న వాళ్లు చప్పట్లు కొట్టారు. కారుపై జరుగుతున్న దాడిని కొందరు తమతమ ఫోన్లలో వీడియో షూట్ చేేశారు. కారు కాలిపోవడంతో పెద్ద ఎత్తున నల్లటి పొగలు అక్కడ ఎగిసిపడ్డాయి. గూగుల్ డ్రైవర్ లెస్ కారు మంటలు కాలిపోతున్న సీన్లతో కూడిన వీడియోలు  సోషల్ మీడియాలో వైరల్(Google Driverless Car) అయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఘటనలో దగ్ధమైన వేమో కారు డ్రైవర్ రహితమైందని, దానికి నిప్పుపెట్టిన టైంలో లోపల ఎవరూ లేరని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ డిపార్ట్‌మెంట్ దర్యాప్తు చేస్తోంది.  దుండగులు దహనం చేసిన ఈ డ్రైవర్ లెస్ కారు జాగ్వార్ I-PACE మోడల్‌కు చెందినదని తెలిపారు. ఇందులో  29 కెమెరాలు, పలు సెన్సార్లు ఉన్నాయని చెప్పారు. గత వారమే శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని వేమో కారు ఒక సైక్లిస్ట్‌ను ఢీకొట్టింది. దీంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. ఈనేపథ్యంలోనే వేమో కారుపై ఇప్పుడు దాడి జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : Bhutto – Sharif : పాకిస్తాన్‌లో సంకీర్ణ సర్కారే.. ఆ మూడు పార్టీల జట్టు!

అమెరికాలో ప్రజలు ఈవిధంగా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను వేధించడం ఇదే తొలిసారేం కాదు. గత సంవత్సరం జనరల్ మోటార్స్ క్రూయిస్ యూనిట్ నడుపుతున్న డ్రైవర్ లెస్ కారును పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో దానిపై స్థానికులు దాడి చేసి,  ధ్వంసం చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో, అరిజోనాలలోని పలు ప్రాంతాలలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల  రాకపోకలకు స్థానికులు అంతరాయం కలిగించారు. వాటి మార్గాన్ని అడ్డుకున్నాయి. వాహనాల్లోకి అక్రమంగా ప్రవేశించడానికి యత్నించారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల సెన్సార్‌లను మోసగించేందుకుగానూ వాటి ఎదుట ఉన్న వాహనాలపై నారింజ రంగు ట్రాఫిక్ కోన్‌లను ఉంచారు.

Also Read :Lok Sabha Elections : టైమ్స్ నౌ సర్వే.. కాంగ్రెస్‌కు 9 ఎంపీ స్థానాలు.. బీఆర్ఎస్, బీజేపీకి ఎన్నో తెలుసా ?