Site icon HashtagU Telugu

Baby Powder Vs Cancer : బేబీ పౌడర్ వాడిన మహిళకు రూ.375 కోట్లు.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు కోర్టు ఆర్డర్

Baby Powder

Baby Powder

Baby Powder Vs Cancer : జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్ చాలా ఫేమస్. చాలామంది ఈ పౌడర్‌ను తమ పిల్లలకు  వాడటాన్ని చాలా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. ఈ పౌడర్‌ను తరుచుగా వాడటం వల్ల థెరిసా గార్సియా అనే మహిళకు మెసోథెలియోమా అనే క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన కేసులో ఇల్లినాయిస్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. బాధిత కుటుంబానికి రూ.375 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని  ‘‘జాన్సన్ & జాన్సన్ కెన్‌వ్యూ’’ కంపెనీని ఆదేశించింది. ఈ పరిహారంలో 70 శాతాన్ని కెన్ వ్యూ కంపెనీ, 30 శాతాన్ని జాన్సన్ & జాన్సన్ కంపెనీ చెల్లించాలని తీర్పులో పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

జాన్సన్ & జాన్సన్ టాల్కమ్ బేబీ పౌడర్‌లోని ఆస్బెస్టాస్, ఫైబర్ మూలాల వల్లే థెరిసా గార్సియాకు క్యాన్సర్ (Baby Powder Vs Cancer) సోకిందని ఆమె తరఫు న్యాయవాది కోర్టులో వాదన వినిపించారు.  దానికి సంబంధించిన పలు ఆధారాలను న్యాయస్థానానికి సమర్పించారు. క్యాన్సర్‌తో చికిత్స పొందుతూ థెరిసా గార్సియా 2020 జులైలో చనిపోయిన విషయాన్ని న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఈ తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీల్ చేయాలని జాన్సన్ & జాన్సన్ కంపెనీ నిర్ణయించింది. తమ బేబీ పౌడర్ క్యాన్సర్ కారకం కాదని, అందులో ఆస్బెస్టాస్ లేదని స్పష్టం చేసింది.

Also Read :301 Jobs : ఎనిమిదో తరగతి పాసైన వారికి గవర్నమెంట్ జాబ్స్

మరోవైపు ఇదే విధంగా జాన్సన్ & జాన్సన్ కంపెనీపై నమోదైన మరో కేసును గురువారం ఫ్లోరిడా కోర్టు కొట్టివేసింది. జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌ను వాడటం వల్ల పాట్రిసియా మాథే అనే మహిళకు  అండాశయ క్యాన్సర్ వచ్చిందంటూ ఆమె కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.  పాట్రిసియా మాథేకు 2016లో క్యాన్సర్ నిర్ధారణ కాగా, 2019లో మరణించారని.. బేబీ పౌడర్ వల్లే  క్యాన్సర్ వచ్చిందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలతో న్యాయస్థానం ఏకీభవించలేదు. జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌‌పై ఈ రెండు కేసులే కాదు.. 2023 డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో తమ ఉత్పత్తులపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు జాన్సన్ & జాన్సన్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ బేబీ పౌడర్ మార్కెటింగ్ కోసం ఏకంగా రూ.5,800 కోట్లు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యింది.

Also Read :Debit- Credit Card Users: ఆర్బీఐ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. డెబిట్, క్రెడిట్ కార్డులు వాడేవారికి గుడ్ న్యూస్!