ఈరోజు అంతర్జాతీయ యువ దినోత్సవం( International Youth Day ). యువతకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాలపై అవగాహన కల్పించడం, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, పర్యావరణ తదితర అంశాల్లో యువత పాత్రను, ప్రాధాన్యతను తెలియజెప్పడం అంతర్జాతీయ యువ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.
‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళోయ్….వెర్రెక్కి ఉన్నోళ్ళోయ్…’ అంటూ అందమైన అనుభవం సినిమాలో బాలు సార్ పాడారు. ఇది అక్షరాల నిజం. యవ్వనంలో ఉన్నంత హుషారు మరెప్పుడూ ఉండదు. ఉరకలెత్తే ఉత్సాహం, పరుగులు పెట్టించే వయసు…దేనికీ పట్టపగ్గాలు ఉండవు. యూత్ అంటేనే ఎనర్జీ. వాళ్ల ఆలోచనలు మెరుపువేగం, చేతల్లో చురుకుదనం, తలచుకుంటే ఏదైనా చేసి చూపించే సత్తా వాళ్ల సొంతం.
నేటి యువతే రేపటి భవిత అంటారు పెద్దలు. యువత తల్చుకుంటే జరగందంటూ ఏది లేదు. యువత శక్తి అంతులేనిది . . అపారమైనది . దేశ ఉన్నతికి , ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణం గా పెడితే అన్నీతిరుగులేని విజయాలే దక్కుతాయి. యువత విజయాలు కేవలం వారికే కాదు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి. యువ శక్తి దేశానికి ఎంతో మేలు చేస్తుంది..అలాగే తప్పు చేస్తే దేహసానికి ముప్పు తెస్తుంది. అలాంటి యువత కోసం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం.
అంతర్జాతీయ యువ దినోత్సవంను ( International Youth Day ) ఎప్పుడు ప్రకటించారంటే..
ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువ దినోత్సవంను ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువ దినోత్సవం ఆగస్టు 12, 2000 లో జరిగింది. ధరిత్రీ దినోత్సవం వంటి ఇతర రాజకీయ అవగాహన దినోత్సవాల మాదిరిగా ఈ దినోత్సవమును జరుపుకోవడం వలన యువత దృష్టిని ఆకర్షించడం ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. సాంస్కృతిక మరియు చట్టపరమైన సమస్యలు ద్వారా అపాయంలో చిక్కుకున్న జనాభాకు ఇటువంటి దినోత్సవాల అవసరం ఉంది.
యవ్వనంలో ఉన్నప్పుడు చేయవల్సిన పనులు ( International Youth Day ) :
మనిషి పుట్టుక అనేది గొప్ప వరం. అందుకే బ్రతికున్న రోజులు ఎంతో కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలి.
జీతంలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే చాలు దాని వలన మనం ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా మంది తెలియక చేసే చిన్న చిన్న తప్పులు వలన జీవితమంతా కూడా పాడైపోతుంది. జీవితంలో మనం చక్కగా పైకి రావాలన్నా అనుకున్నది సాధించాలన్నా యవ్వనం చాలా ముఖ్యమైనది.
దేశ పురోగతిలో యువతదే ముఖ్య పాత్ర కాబట్టి యువత యవ్వనంలో తప్పులు చేయకుండా విజయం పై శ్రద్ధ పెట్టాలి పైగా యవ్వనంలో ఉన్నప్పుడు అనుసరించే విధానాలు దేశాభివృద్ధి పై ప్రభావం చూపుతాయి.
చెడు పనులు చేయకూడదు ( International Youth Day ):
యవ్వనంలో ఉన్నప్పుడు చెడు పనులు అసలు చేయకూడదు. ఇలా చేయడం వలన మీరు మంచి మార్గంలో వెళ్ళలేరు. మత్తు మొదలైన వాటికి దూరంగా ఉండాలి అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు రావు.
సోమరితనం :
సోమరితనం వలన కష్టపడలేరు. కష్టపడితే కానీ ఏదీ రాదు. యువత యవ్వనంలో సోమరిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా జీవితం బాగోదు. సమయం విలువని తెలుసుకుని మంచిగా ముందుకు వెళితే విజయం మీదే.
కోపం :
కోపం అసలు పనికిరాదు. కోపం వలన మనం చేయవలసిన పనిని మర్చిపోతూ ఉంటాము. పైగా కోపం ఒంటరిని చేసేస్తుంటే కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు కోపం కూడా పనికిరాదు. మంచి భవిష్యత్ కోసం గట్టి పునాది వేసుకోవాలి. డబ్బు సంపాందించాలి . మంచి ప్రేమను పొందాలి…ఇంకా ప్రేమను పంచాలి . ముఖ్యంగా మంచి ఫ్రెండ్స్ ను కలిగి ఉండటం కూడా గొప్పవిషయం. అదేవిదంగా కొత్త విషయాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఎప్పుడైతే యంగ్ ఏజ్ లో కష్టపడతారో.. మిడిల్ ఏజ్ లో అంత సంతోషంగా గడపగలరు.
యువతను ఉద్దేశించి మహనీయులు చెప్పిన సూక్తులు :
“కల, కల, కల.. కలలు ఆలోచనలవుతాయి.. ఆలోచనలు ఆచరణలోకి వస్తాయి” – ఏపీజే అబ్దుల్ కలాం.
“యువత ఆనందానికి హామీ ఇస్తున్నారు. కానీ జీవితం కష్టాలను ఆఫర్ చేస్తోంది” – నికోలస్ స్పార్క్స్
“యూత్ అంటే ఓ కల. వాళ్లు పిచ్చెక్కించే ఓ రకమైన రసాయన పదార్థం” – ఎఫ్ స్కాట్ ఫిట్జెరాల్డ్
“మీ యువత కలలు నిజం అయ్యేలా చెయ్యండి” – ఫ్రెడెరిక్ షిల్లర్
“ఓ తరం గొప్పది అవుతుంది. అది మీ తరమే కావచ్చు. మీ గొప్పదనాన్ని వికసింపనివ్వండి” – నెల్సన్ మండేలా
“నాకు యువతపై నమ్మకముంది. వారు సరికొత్త జనరేషన్. వారు సమస్యల్ని సింహాల్లా పరిష్కరిస్తారు” – స్వామి వివేకానంద
“యువతలో వచ్చే మంచి అలవాట్లు వైవిధ్యాన్ని చూపిస్తాయి” – అరిస్టాటిల్
“ఈరోజు యువతను బట్టీ రేపటి భవిష్యత్తు ఉంటుంది” – విల్లీ స్టార్గెల్
Read Also : World Elephant Day : గజరాజులకు గండం.. మొదటి శత్రువు మనిషే !