Site icon HashtagU Telugu

Point Nemo : భూమిపైనే అంత‌రిక్ష శ్మశానవాటిక.. అడ్రస్ ఇదీ

Point Nemo

Point Nemo

Point Nemo : ‘పాయింట్ నిమో’.. భూమిపై ఉన్న అంత‌రిక్ష శ్మశానవాటిక !! ఇది ఎక్కడుందో తెలుసా ?  అంటార్కింటికా ప్రాంతం నుంచి ఉత్త‌రాన 3000 మైళ్లు.. న్యూజిలాండ్ నుంచి దక్షిణాన 2000 మైళ్ల దూరంలో పసిఫిక్ మ‌హాస‌ముద్రంలో ‘పాయింట్ నిమో’ ఉంది. ఈ భూమండ‌లంపై మానవుడు చేరుకోవ‌డం కూడా అసాధ్యం అనిపించే మారుమూల ప్ర‌దేశం ఇది. ఇక్క‌డికి మ‌నిషి చేరుకోవాలంటే వేల‌కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది. భూమి పైభాగాన అంత‌రిక్షంలో తిరిగే అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో నివ‌సించే వ్యోమగాములే పాయింట్ నిమోకు ద‌గ్గ‌ర‌గా ఉంటారు. ఈ పాయింట్‌కు(Point Nemo) 415 కిలోమీటర్ల ఎగువన అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం చక్కర్లు కొడుతోంది.

We’re now on WhatsApp. Click to Join

అత్యంత మారుమూల ప్రాంతం కావడంతో ‘పాయింట్ నిమో’లోనే కాలం చెల్లిన ఉప‌గ్ర‌హాలు, ఇత‌ర అంత‌రిక్ష వ్య‌ర్థాల‌ను వేస్తుంటారు. పాడైపోయిన ఉపగ్రహాలు పాయింట్ నిమో వద్ద కూలిపోయేలా ప్ర‌ణాళిక‌లు వేస్తుంటారు. 2030 నాటికి అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రం టైం కూడా ముగిసిపోనుంది. దీంతో అది కూడా పాయింట్ నిమో వ‌ద్దే స‌ముద్ర‌గ‌ర్భంలో క‌లిసిపోనుంది. అంతరిక్ష వ్యర్థాలను డంప్ చేస్తుండటంతో పాయింట్ నిమోకు అంతరిక్ష వ్య‌ర్థాల శ్మశానవాటికగా పేరొచ్చింది.

Also Read : CAA Rules : మార్చి నుంచే సీఏఏ అమల్లోకి.. ఎన్నికల కోడ్‌కు ముందే ప్రకటన

2019లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం..  1971 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు పాయింట్ నిమో ప్రాంతంలో 263కిపైగా అంతరిక్ష శిథిలాలను కూల్చేశారు. నాసాకు చెందిన స్కైలాబ్, రష్యాకు చెందిన మిర్ వంటి అంతరిక్ష కేంద్రాలను కూడా ఇక్కడే కూల్చేశారు. పాయింట్ నిమో మానవులకు సుదూరంగా ఉన్నప్పటికీ.. ఈ ప్రాంతంలోని సముద్రంలో పేరుకుపోతున్న అంతరిక్ష వ్యర్థాలలోని మైక్రో ప్లాస్టిక్ కణాలు మాన‌వాళికి భవిష్య‌త్తులో స‌వాళ్ల‌ను విసురుతాయని  ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అంత‌రిక్ష శ్మశానవాటిక మాన‌వ మ‌నుగ‌డ‌పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో వేచి చూడాలి.

Also Read :Fastest T20I Hundred: విధ్వంసం.. 33 బంతుల్లోనే సెంచ‌రీ..!

వచ్చే ఏడాది భారత్ ప్రయోగించనున్న గగన్‌యాన్‌కు సంబంధించి భారత్ కీలక ప్రకటన చేసింది. గగన్‌యాన్‌ కోసం సిద్ధం చేసిన తొలి అంతరిక్ష విమానంలో ప్రయాణించే నలుగురు వ్యోమగాములను పరిచయం చేసింది. భారత వైమానిక దళం నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాను గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికచేసినట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ వీరిని మంగళవారం తిరువనంతపురంలో సత్కరించారు. గగన్ యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని లో ఎర్త్ కక్ష్యలోకి ప్రవేశపెట్టి, మూడురోజుల తరువాత వారిని వెనక్కు తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌కు సంబంధించి అనేక పరీక్షలు నిర్వహించింది.వ్యోమగాములను తీసుకువెళ్ళే అంతరిక్ష నౌక సరిగా పనిచేయకపోతే సిబ్బంది సురక్షితంగా తప్పించుకోవడం ఎలా అనే విషయమై అక్టోబరులో ఓ కీలక పరీక్ష నిర్వహించింది.ఇది విజయవంతం కావడంతో 2025లో వ్యోమగాములను పంపడానికి ముందే ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఓ రోబోను అంతరిక్షంలో పంపుతామని ప్రకటించింది.