Instagram Ads : ఇకపై ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్‌కు కొంత అసౌకర్యం ఎదురయ్యే అవకాశం ఉంది. యూట్యూబ్‌లో మనం స్కిప్ చేయలేని యాడ్స్‌ను చూస్తుంటాం కదా.. అచ్చం అలాంటి యాడ్స్‌నే ఇన్‌స్టాగ్రామ్ టెస్ట్ చేస్తోంది. త్వరలోనే వాటిని యాక్టివ్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్లకు అన్‌స్కిప్పెబుల్ యాడ్స్‌ను పంపి ఇన్‌స్టాగ్రామ్ టెస్ట్ చేస్తోంది. వచ్చే ఫలితాల ఆధారంగా రానున్న రోజుల్లో యూజర్లు అందరికీ వాటిని పంపనుంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అన్‌స్కిప్పెబుల్ యాడ్స్ ఫీచర్‌కు ‘యాడ్ బ్రేక్స్’ అని పేరు పెట్టారు. తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ యాడ్స్‌ను చూసిన వారు వాటి గురించి వివరిస్తూ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. దాదాపు 3 నుంచి 5 సెకండ్ల పాటు స్కిప్ చేయలేని యాడ్ వస్తోందని వారు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఇన్‌స్టాగ్రామ్‌కు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. స్కిప్ చేయలేని ఈ యాడ్స్ ఆప్షన్‌ను యాక్టివేట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా (ఫేస్ బుక్)కు భారీగా ఆదాయం వస్తుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ అక్కడ యాడ్స్ ఇచ్చేందుకు ఎగబడతాయి. యూజర్ల అభిరుచి, లొకేషన్‌కు అనుగుణంగా యాడ్స్‌ను చూపిస్తుంటారు. నేటికాలంలో యూజర్లకు యాడ్స్ చూపించేందుకు కూడా ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నారు. యూజర్లు సెర్చ్ చేసే కంటెంట్ రకానికి సంబంధించిన యాడ్స్‌ను చూపించేలా కొన్ని ఏఐ రోబోట్స్ బ్యాక్ గ్రౌండ్‌లో పనిచేస్తుంటాయి.
Also Read :MLC By Election : తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అవుతారా ? ఇవాళే కౌంటింగ్
యూట్యూబ్ కూడా తొలుత ఇలాగే కేవలం 5 సెకండ్ల అన్‌స్కిప్పెబుల్ యాడ్స్‌తో మొదలుపెట్టింది. ఇప్పుడు యూట్యూబ్‌లో స్కిప్ చేయలేని నిమిషం నిడివి కలిగిన యాడ్స్‌ను కూడా చూపిస్తున్నారు. ఫ్యూచర్‌లో ఇన్‌స్టాగ్రామ్ కూడా యూట్యూబ్ బాటలోనే పయనించే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ ఆప్షన్ యూజర్ల ఓపికకు పరీక్ష పెట్టేలా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ స్కిప్ చేయలేని యాడ్స్ వద్దు అని భావించే వారి కోసం యూట్యూబ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ అందిస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్ కూడా అలాంటి ఆఫర్‌తోనే ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.