Singh Is King : రోల్స్ రాయిస్.. ఇది ప్రపంచంలో వందల కోట్ల మంది డ్రీమ్ కారు. ఇలాంటి లగ్జరీ కారు కొనేందుకు ఎన్నో సేవింగ్స్ చేస్తారు.. ఎంతో రిస్క్ తీసుకొని కష్టపడతారు.. కానీ అతికొద్ది మంది మాత్రమే ఈ కాస్ట్లీ కార్లు కొనగలుగుతారు. ఈ లెక్క బ్రిటన్ లోని భారత సంతతి బిజినెస్ మెన్ రూబెన్ సింగ్ (Reuben Singh) కు వర్తించదు. ఎందుకంటే.. ఆయన డ్రీమ్ పూర్తయింది. ఇప్పుడు ఆయన కార్ షెడ్డులో ఒకటి కాదు.. రెండు కాదు.. 15 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కో కలర్ లో చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి.
రీసెంట్ గా దీపావళి పండుగ సందర్భంగా రూబెన్ సింగ్ ఒకేసారి 5 కార్లు కొన్నాడు. ఇవన్నీ తీరొక్క రంగులో ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే.. రూబెన్ సింగ్ దగ్గర ఉన్న 15 కార్లు 15 డిఫరెంట్ రంగులవి. ఏ కార్ లో బయటికి వెళితే.. ఆ కలర్ టర్బన్ ను రూబెన్ సింగ్ ధరిస్తాడు.
రూబెన్ (Reuben Singh) కార్ల లిస్ట్ ఇదీ..
రూబెన్ దగ్గర ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. వాటిలో లంబోర్ఘిని హురాకాన్, బుగాటి వేరాన్, ఫెరారీ F12 బెర్లినెట్టా, పోర్షే 918 స్పైడర్, పగని హుయ్రా కూడా ఉన్నాయి. వీటి ఒక్కోదాని సగటు ధర రూ.3 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా ఉంటుంది.
బిజినెస్ లో సక్సెస్ ఇలా సాధించాడు..
రూబెన్ సింగ్ ఫ్యామిలీకి ఇవన్నీ అంత ఈజీగా రాలేదు. దీని వెనుక చెమట చుక్కల సముద్రం ఉంది. కష్టాల సునామీ ఉంది..ప్రయత్నాల తుఫాను ఉంది.. రూబెన్ సింగ్ వాళ్ళ కుటుంబం 1970వ దశకంలో ఇండియా నుంచి బ్రిటన్ కు వలస వచ్చింది. రూబెన్ సింగ్ ఎంతో చిన్న స్థాయిలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ “ఇషర్ క్యాపిటల్”, కస్టమర్ సర్వీస్ అవుట్‌సోర్సింగ్ కంపెనీ “AlldayPA” స్థాపించారు. ఎంతో అంకితభావంతో చెమట చిందించి, శ్రమించి ఈ బిజినెస్ లను రూబెన్ సింగ్ సక్సెస్ చేయించారు. అందుకే కొన్నిసార్లు ఆయనను బ్రిటీష్ బిల్ గేట్స్ అని కూడా పిలుస్తారు. ఇంకొందరు “సింగ్ ఈజ్ కింగ్” అని కూడా రూబెన్ ను అంటారు.
Also Read: Urvashi Rautela: ఊర్వశి రౌతేలా.. రూ.190 కోట్ల ఇల్లు.. రూ.276 కోట్ల నగలు