Site icon HashtagU Telugu

Mobile Phone Charging : కరెంటు లేనప్పుడు ఫోన్‌ను ఇలా ఛార్జింగ్ చేయండి

Mobile Phone Charging

Mobile Phone Charging : కరెంటు పోయినప్పుడు సెల్‌ఫోన్ ఛార్జింగ్ కోసం మనం పవర్ బ్యాంక్స్ వాడుతుంటాం. ఒకవేళ పవర్ బ్యాంక్ అందుబాటులో లేకుంటే ఎలా ? అనే డౌట్ చాలామందికి వస్తుంటుంది. అలాంటి వారికి కీలకమైన సమాచారాన్ని అందించడమే ఈ వార్త సారాంశం.

We’re now on WhatsApp. Click to Join

కరెంటు సప్లై లేనప్పుడు మొబైల్ ఫోనును ఛార్జింగ్ చేయడానికి  కార్ సిగరెట్ లైటర్‌తో ఉండే యూఎస్‌బీ అడాప్టర్ కావాలి. ఫోన్‌ ఛార్జ్ చేయటానికి ఉపయోగించే కేబుల్ ఉండాలి. 9 ఓల్టుల బ్యాటరీతో పాటు ఏదైనా లోహపు క్లిప్ ఉండాలి. ఒక బాల్ పాయింట్ పెన్ లేదా తాళం చెవి ఉండాలి. బ్యాటరీలోని కరెంటును సెల్ ఫోనులోకి పంపించడానికి మనకు ఒక ఎలక్ట్రికల్ కండక్టర్‌ కావాలి. ఇక్కడ మనం ఎలక్ట్రికల్ కండక్టర్‌‌గా లోహపు క్లిప్‌ను వాడుతాం.  ఇలా మన ఫోనును ఛార్జింగ్(Mobile Phone Charging) చేస్తే అత్యవసర ఫోన్‌కాల్స్ చేసుకోవచ్చు. మెసేజ్‌లు పంపుకోవచ్చు.

Also Read : Torn Jeans Ban : టీషర్ట్, చిరిగిన జీన్స్‌తో కాలేజీకి రావొద్దు

బ్యాటరీకి రెండు టెర్మినళ్లు ఉంటాయి. ఒకటి ప్లస్, రెండోది మైనస్.  లోహపు క్లిప్‌ను తెరిచి..  బ్యాటరీ నెగెటివ్ ధృవానికి చుట్టాలి. లోహపు క్లిప్ ఒక భాగం పైకి, మరొక భాగం వెలుపలికి తెరచి ఉండాలి. బ్యాటరీ మరో ధృవం మీద కార్ అడాప్టర్‌ను ఉంచాలి. తదుపరిగా లోహపు క్లిప్, అడాప్టర్ మీద ఉన్న లోహపు భాగాన్ని తాకేలా సెట్ చేయాలి.  ఇవి రెండూ కలిస్తే ఎలక్ట్రాన్లు ప్రవహిస్తాయి. విద్యుత్ పుడుతుంది. చివరిగా సెల్‌ఫోన్‌ను యూఎస్‌బీ సాకెట్‌లో ప్లగ్ చేయాలి. కంప్యూటర్‌లో యూఎస్‌బీ సాకెట్‌కు ప్లగ్ చేసినట్లుగానే ఇక్కడ కూడా చేయాలి. అన్ని బ్యాటరీల్లోనూ ఎలక్ట్రోలైట్లు, ఇతర రసాయనాలు ఉంటాయి. ఈ రసాయన శక్తే విద్యుత్ శక్తిగా మారుతుంది.