Site icon HashtagU Telugu

Cyclone Names : తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు ? ‘రెమాల్’ అర్థమేంటి ?

Cyclone Names

Cyclone Names

Cyclone Names : ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బెంగాల్ తీరాన్ని వణికించింది. దాదాపు 10 మందికిపైగా దీనివల్ల ప్రాణాలు కోల్పోయారు. సుమారు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అరబిక్ భాషలో రెమాల్ అంటే ఇసుక అని అర్థం. గతంలో ఈపేరును ఒమన్ దేశం సిఫార్సు చేసింది. ఏ దేశం సిఫార్సు చేసిందన్న దానితో నిమిత్తం లేకుండా రొటేషన్ పద్ధతిలో తుఫాన్లకు పేర్లు పెడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానుల హెచ్చరికలు, విపత్తు సన్నద్ధతను పెంచేందుకు ఉష్ణమండల తుఫాన్లపై సభ్య మండలి (పీటీసీ)ని 1972లో ఏర్పాటు చేశారు. ఇందులో తొలుత భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంక, ఒమన్, థాయ్‌లాండ్ సభ్య దేశాలుగా ఉండేవి. 2000 సంవత్సంలో ఒమన్‌ రాజధాని మస్కట్‌లో జరిగిన సమావేశంలో కీలక పరిణామం జరిగింది.  ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా పీటీసీలో సభ్య దేశాలుగా చేరాయి.  బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులకు పేర్లు పెట్టాలని ఆ ఏడాదే పీటీసీ నిర్ణయించింది. తుఫానులకు సంబంధించి ఒక్కో సభ్య దేశం పంపిన సిఫార్సులతో ఆయా దేశాల పేర్ల ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో ఒక జాబితాను తయారు చేస్తామని పీటీసీ తెలిపింది.  ఆ జాబితా ప్రకారమే 2004 సంవత్సరం నుంచి తుఫానులకు వరుసగా పేర్లు పెడుతూ వస్తున్నారు. పీటీసీలోని దేశాలన్నీ కలిసి ఎన్నో తుఫానులకు పేర్లు పెట్టాయి. 2004 నుంచి ఇప్పటివరకు దాదాపు 169 తుఫానులకు పేర్లు పెట్టాయి. అయితే మతవిశ్వాసాలు, సంస్కృతి, రాజకీయాలతో సంబంధంలేని పేర్లనే తుఫానులకు ఎంపిక చేస్తారు. తుఫాను పేరు గరిష్ఠంగా 8 అక్షరాలు మాత్రమే ఉండాలి. ఆ పదం పేరు, ఉచ్చారణ వాయిస్ రికార్డింగ్ ఉండాలి.

Also Read :Power Cuts : పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం

Also Read : Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం