1700 Buildings Destroyed : ఆ టౌన్ 80 శాతం కాలి బూడిదైంది.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు

1700 Buildings Destroyed : అమెరికాలోని హవాయి  రాష్ట్రం లహైనా టౌన్ శివార్లలోని అడవుల్లో చెలరేగిన భీకర కార్చిచ్చు జనావాసాలకు వ్యాపించి ఇప్పటివరకు 53 మందిని బలిగొంది.

  • Written By:
  • Updated On - August 11, 2023 / 08:42 AM IST

1700 Buildings Destroyed : అమెరికాలోని హవాయి  రాష్ట్రం లహైనా టౌన్ శివార్లలోని అడవుల్లో చెలరేగిన భీకర కార్చిచ్చు జనావాసాలకు వ్యాపించి ఇప్పటివరకు 53 మందిని బలిగొంది. ఎంతోమంది గాయాలపాలై ఆస్పత్రుల్లో చేరారు. ఈ మంటల ధాటికి  1,700 ఇళ్లు కాలిపోయాయి. ఈ వివరాలను మావీ కౌంటీ అధికారులు ధృవీకరించారు. హరికేన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీస్తుండటంతో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. దీనివల్ల లహైనా పట్టణంలో 80% కనుమరుగైందని వెల్లడించారు. టౌన్ లోని ఏ వీధిలో చూసినా  దట్టమైన పొగ అలుముకొని కనిపిస్తోంది. వేలాది మందిని తాత్కాలిక షెల్టర్ హోమ్స్ కు తరలించారు.  11,000 మంది లహైనా టౌన్ ప్రజలు ఇప్పటికీ విద్యుత్ లేకుండా చీకటిలో మగ్గుతున్నారు. ఎన్నో కార్లు కూడా ఈ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈనేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ .. లహైనా టౌన్ కార్చిచ్చును  పెను విపత్తుగా ప్రకటించారు. సహాయక చర్యలకు నిధులను రిలీజ్ చేశారు.

Also read : Today Horoscope : ఆగస్టు 11 శుక్రవారం రాశి ఫలితాలు.. వారిపై ఒత్తిళ్లు అధికం

మంగళవారం రాత్రి నుంచే ఈ కార్చిచ్చుతో లహైనా టౌన్ (1700 Buildings Destroyed)  సతమతం అవుతోంది. ఈ టౌన్ లో 16 రోడ్ల పరిధిలో మంటలు అలుముకున్నాయి. దీంతో వాటిని మూసేశారు. ఇప్పుడు లహైనా టౌన్ ను కనెక్ట్ చేసే ఒకే ఒక్క హైవే తెరిచి ఉంది. ఆ మార్గంలోనే వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక  ఈ కార్చిచ్చు నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు లహైనా టౌన్ తీరంలోని   పసిఫిక్‌ మహాసముద్రంలోకి కూడా దూకారని వార్తలు వస్తున్నాయి.