Site icon HashtagU Telugu

Nightmares : పీడకలలు వస్తున్నాయా ? అవి రావొద్దంటే ఇలా చేయండి

Nightmares Vs Health Problems

Nightmares Vs Health Problems

Nightmares : రాత్రివేళ నిద్రలో చాలామందికి కలలు వస్తుంటాయి. కొంతమందికి పీడకలలు వస్తుంటాయి. పీడకలల వల్ల సరిగ్గా నిద్రపట్టక పలువురు సతమతం అవుతుంటారు. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. మన బాడీ మన కంట్రోల్‌లో ఉండదు. మెదడు సరిగ్గా పనిచేయదు. నిద్రలేమి వల్ల.. జీవితం గడపడానికి అత్యంత  కీలకమైన పనులను చేయలేక మనం చతికిలపడే రిస్క్ ఉంటుంది. ఇంత పెద్ద రిస్కుకు దారితీసే పీడకలల సమస్యకు పరిష్కారం ఏమిటి ? అసలు  పీడకలలు(Nightmares) ఎందుకు వస్తాయి ?

We’re now on WhatsApp. Click to Join

మాటిమాటికి పీడకలలు వచ్చే కండిషన్‌ను నైట్‌మేర్‌ డిజార్డర్‌‌ అంటారు. ట్రామా, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)తో బాధపడుతున్న వ్యక్తులు కూడా తరచుగా పీడకలలను అనుభవిస్తుంటారు. పీడకలలు రావడానికి అత్యంత సాధారణ కారణాలు ఒత్తిడి, ఆందోళన. ప్రతికూల ఆలోచనలు మనసులో ఓవర్‌లోడ్‌ అయినప్పుడు.. మనకు నిద్ర సరిగ్గా  పట్టదు. ఈక్రమంలోనే రాత్రిపూట భయపెట్టే కలలు వస్తుంటాయి. పీడకలల వల్ల ఒత్తిడి పెరిగి మన శరీరం నుంచి కార్టిసాల్ అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి రిలీజ్ అయితే పీడకలలు మరింత పెరుగుతాయి. పీడకలల సమస్యను తీర్చుకునేందుకు మన జ్యోతిష, వాస్తు శాస్త్రాల్లో పరిష్కారాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ అవేమిటో చూద్దాం..

Also Read :Gold Reserves : ఓ వైపు యుద్ధాలు.. మరోవైపు గోల్డ్ రిజర్వులు.. ఏం జరుగుతోంది ?

Also Read :Ministries Race : ఆ ఆరు మంత్రి పదవులు అడగొద్దు.. ఎన్డీయే మిత్రపక్షాలకు బీజేపీ నో !