Site icon HashtagU Telugu

Bournvita : బోర్న్‌వీటా ‘హెల్త్ డ్రింక్’ కాదు.. మోడీ సర్కారు కీలక ఆదేశం

Govt Asks E Commerce Websit

Govt asks e-commerce websites to remove Bournvita from 'healthy drinks' section

Bournvita: బోర్నవిటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు శక్తినిచ్చే పానీయంగా బోర్నవిటా ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉంది. బహుళజాతి కన్ఫెక్షనరీ సంస్థ క్యాడ్ బరీ బోర్నవిటాను ఉత్పత్తి చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే, భారత కేంద్ర ప్రభుత్వం(Central Government of India) కీలక నిర్ణయం తీసుకుంది. బోర్నవిటాను ఆరోగ్య పానీయాల జాబితా నుంచి తొలగించాలని అన్ని ఈ-కామర్స్ పోర్టళ్లకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సూచించింది. ఇది బోర్నవిటాకు మాత్రమే కాకుండా, ఈ కామర్స్ పోర్టళ్లలో హెల్త్ డ్రింకులుగా చలామణీలో ఉన్న అన్ని రకాల పానీయాలు, బేవరేజెస్ కు వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Read Also: Wrong UPI Transaction: మీరు యూపీఐ ద్వారా రాంగ్ నంబ‌ర్‌కు డ‌బ్బు పంపారా..? అయితే ఇలా చేయండి..!

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) సెక్షన్ 14 ఆఫ్ సీఆర్పీసీ యాక్ట్ 2005 కింద జరిపిన విచారణలో ఆరోగ్య పానీయాలు అంటూ ఏవీ లేవని నిర్ధారించినట్టు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ తన ప్రకటనలో వెల్లడించింది.

Read Also: Owaisi : బోగ‌స్ ఓట్ల ఆరోప‌ణ‌పై స్పందించిన అస‌దుద్దీన్ ఓవైసీ

కాగా, బోర్నవిటాలో నిర్దేశిత స్థాయి కంటే చక్కెర మోతాదు అధికంగా ఉన్నట్టు ఎన్సీపీసీఆర్ గుర్తించింది. బలవర్ధకమైన ఆరోగ్య పానీయాలు అంటూ ప్రచారం చేసుకుంటున్న వాణిజ్య ఉత్పత్తులపై చర్యలు తీసుకోవాలని ఎన్సీపీసీఆర్ గతంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)ని కోరింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల ప్రకారం బోర్నవిటా వంటి ఉత్పాదనలను హెల్త్ డ్రింకులుగా పేర్కొనలేమని స్పష్టం చేసింది.