Site icon HashtagU Telugu

Project Astra : ఇంట్లో పోగొట్టుకున్న వస్తువులను కనిపెట్టే ఏఐ ఫీచర్

Project Astra

Project Astra

Project Astra : కొత్తకొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ (ఏఐ) ఫీచర్లతో గూగుల్ దుమ్ము రేపుతోంది. తాజాగా గూగుల్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ అస్త్రా’ (Project Astra)లో అదిరిపోయే ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. ఇది గూగుల్ కంపెనీకి సంబంధించిన కొత్త ఏఐ ప్రాజెక్ట్. ఇది ఫ్యూచర్‌లో ఏఐ అసిస్టెంటుగా యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు అచ్చం OpenAI, GPT4oలా ఉంటుందని అంటున్నారు. ఈ ఏఐ ఫీచర్ వచ్చాక.. మన ఫోన్ లో ఉండే కెమెరా నుంచి వస్తువులను చూస్తే.. వాటి గురించి వివరణలు వినొచ్చు. ఇటీవల Google Deep Mind తమ ట్విట్టర్ అకౌంట్ దీనికి సంబంధించిన ఓ  వీడియోను షేర్ చేసింది. ‘ప్రాజెక్ట్ అస్త్ర’ ఏఐ అసిస్టెంట్‌ను ఫోన్ కెమెరా ద్వారా వాడుతూ.. మనం ఇంట్లో పోగొట్టుకున్న వస్తువులను చాలా ఈజీగా కనిపెట్టొచ్చు.  త్వరలో Google Pixel 8a సిరీస్ స్మార్ట్ ఫోన్లలో, ఆండ్రాయిడ్ 15 OnePlus, Samsungకు చెందిన అనేక ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join

గూగుల్‌ మెసేజెస్‌లో ‘ఎడిట్’ ఆప్షన్

ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ మెసేజెస్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడిపోయింది. ఇప్పటికే వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. వంటి యాప్‌లకు ‘ఎడిట్‌’ ఆప్షన్‌ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్‌ కూడా ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది. దీంతో ఇకపై RCS చాట్‌ ద్వారా పంపే సందేశాలనూ ఎడిట్‌ చేసే అవకాశాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఇది 15 నిమిషాలలోగా ఛాట్ సెక్షన్‌లో అక్షరదోషాలను (ఎడిట్‌) సరిచేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. గూగుల్‌ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌ తో RCS ద్వారా పంపే ఏ మెసేజ్‌నైనా ఎడిట్‌ చేసుకోవచ్చు.. అయితే, అందుకోసం మనం పంపిన మెసేజ్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేస్తే.. పాప్‌ అప్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో ‘‘ఎడిట్‌’’ ఆప్షన్‌ను ఎంచుకుని సందేశంలోని తప్పులు సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఇక, ఇలా సవరించిన మెసేజ్‌కు కింద చివరన ఎడిటెడ్‌ అని స్పష్టంగా కనిపిస్తుంది.