Site icon HashtagU Telugu

ChatGPT Vs Google : మీడియా, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఇక విప్లవమే.. గూగుల్ ‘జెమిని’ వస్తోంది

Chatgpt Vs Google

Chatgpt Vs Google

ChatGPT Vs Google : ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీలో  ఓపెన్ ఏఐ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు గూగుల్ సరికొత్త టూల్ ను రెడీ చేసింది. దానిపేరే .. ‘జెమిని’ !! ఓపెన్ ఏఐ  కంపెనీ తీసుకొచ్చిన ‘GPT-4’ మోడల్‌కు గట్టి పోటీని ఇచ్చేలా, ఆకట్టుకునే ఫీచర్స్ తో ‘జెమిని’ ఏఐ టూల్ ను గూగుల్ తయారు చేసింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం దీన్ని కొన్ని ఎంపిక  చేసిన కంపెనీలకు గూగుల్ అందించింది. జెమినికి ఉన్న స్పెషాలిటీల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రత్యేకించి ఫ్యూచర్ లో ఇది సాఫ్ట్ వేర్ కంపెనీల పనిని, మీడియా కంపెనీల పనిని ఈజీ చేయబోతోంది.

Also read : MLC Kavitha – ED : అప్పటిదాకా.. ఈడీ విచారణకు వెళ్లకూడదని కవిత నిర్ణయం!

జెమిని టూల్ ను ఉపయోగించి  సాఫ్ట్ వేర్  నిపుణులు సులభంగా కోడింగ్ రాయొచ్చు. కాపీయింగ్  కు తావులేని ఒరిజినల్  న్యూస్ స్టోరీని కూడా ఇది మీడియా సంస్థలకు తయారుచేసి ఇవ్వగలదు.  వినియోగదారుడు ఇచ్చే ఇన్ స్ట్రక్షన్స్ కు అనుగుణంగా ఒరిజినల్ ఫోటోలను కూడా జెమిని క్రియేట్ చేసి ఇవ్వగలదు. ఈ ఫీచర్ కూడా మీడియా, డిజిటల్ మార్కెటింగ్ సహా ఎన్నో రంగాలకు ఉపయోగపడనుంది.  వీటితో పాటు చాట్‌బాట్‌లను క్రియేట్ చేసేందుకు హెల్ప్ చేయనుంది. టెక్స్ట్ ను సమ్మరైజ్ చేసి పెట్టడం, ఈమెయిల్ లు రాసిపెట్టడం, మ్యూజిక్ లిరిక్స్ ను క్రియేట్ చేసి ఇవ్వడం వంటి వర్క్స్ సైతం జెమిని చేయగలదు. ప్రస్తుత  పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమాచారం ఆధారంగా జెమిని ఏఐ టూల్ ను మరింతగా గూగుల్ (ChatGPT Vs Google) డెవలప్ చేయనుంది. ఆ తర్వాత  ‘గూగుల్ క్లౌడ్ వెర్టెక్స్ ఏఐ సర్వీస్’ ద్వారా దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తేవాలని సెర్చ్ ఇంజన్ దిగ్గజం యోచిస్తోంది.