Site icon HashtagU Telugu

MLC Kavitha – ED : అప్పటిదాకా.. ఈడీ విచారణకు వెళ్లకూడదని కవిత నిర్ణయం!

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha – ED  : ఢిల్లీ లిక్కర్ స్కాంలో శుక్రవారం విచారణకు రావాలంటూ ఈడీ గురువారం జారీ చేసిన నోటీసులపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు.  నేడు విచారణకు హాజరు కాకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత కవిత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్‌ను కొట్టేస్తేనే ఈడీ విచారణకు వెళ్లాలని కవిత డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇవాళ కవితకు బదులుగా ఆమె తరఫు లాయర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక గురువారం రోజు ఈడీ నోటీసులపై కవిత స్పందిస్తూ.. వాడిని మోడీ నోటీసులుగా అభివర్ణించారు. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈడీ నోటీసులను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ఆ నోటీసులు రాజకీయ పార్టీ నుంచి వచ్చాయని ఎద్దేవా చేశారు. వాటిని తమ పార్టీ లీగల్ సెల్ పరిశీలించి, ఏం చేయాలనే దానిపై సలహాలు ఇస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఈడీ ఎలా స్పందిస్తుందో.. సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.

Also read : Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకు కూడా వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలి.. బీసీసీఐని కోరిన గవాస్కర్