Apple Feature In Android : సాధారణ స్మార్ట్ ఫోన్లు అన్నింటిలోనూ ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ అనేది గూగుల్ కంపెనీకి చెందినది.యాపిల్ కంపెనీ ఫోన్లలో ఐఓఎస్ (iOS) సాఫ్ట్ వేర్ ఉంటుంది. యాపిల్ కంపెనీకి చెందిన ఒక ఫోన్ ను మరో ఫోన్ తో లింక్ చేయడానికి “కంటిన్యూటీ” అనే ఫీచర్ ఉంటుంది. అచ్చం ఇలాంటిదే ఒక ఫీచర్ ను ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ తీసుకొచ్చేటందుకు గూగుల్ రెడీ అవుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్లను, ట్యాబ్ లను, ల్యాప్ ట్యాప్ లను ఒకదాన్ని మరోదానితో లింక్ చేయడానికి అనుమతించే కొత్త ఫీచర్‌ను గూగుల్ డెవలప్ చేస్తోంది. ఒకే జీమెయిల్ తో సైన్ ఇన్ చేసిన ఆండ్రాయిడ్ డివైజ్ లు ఒకదానితో ఒకటి లింక్ అయ్యేందుకు ఈ ఫీచర్ హెల్ప్ చేస్తుంది.
Also read : World Organ Donation Day: నేడు ప్రపంచ అవయవ దాన దినోత్సవం.. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటంటే..?
ఫ్యూచర్ లో రాబోయే ఈ ఫీచర్ వివరాలను ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహమాన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ ఫీచర్ పనితీరు అనేది Apple ఫోన్లలోని “కంటిన్యూటీ” ఫీచర్‌ని పోలి ఉంటుందన్నారు. అయితే కొన్ని చిన్నపాటి తేడాలు ఉంటాయని చెప్పారు. ఆండ్రాయిడ్ ఫోన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి.. గూగుల్ ఆప్షన్ ను క్లిక్ చేసి.. త్వరలో వచ్చే “డివైసెస్ & షేరింగ్” ఆప్షన్ ను సెటప్ చేస్తే ఈ ఫీచర్ ను ఎంజాయ్ చేయొచ్చన్నారు. అయితే ఈ ఫీచర్ లపై(Apple Feature In Android) గూగుల్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
లింక్ చేసిన ఫోన్ల మధ్య కాల్ స్విచింగ్
- ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. “కాల్ స్విచింగ్” సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకే జీమెయిల్ అకౌంట్ తో లింక్ అయి ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్ ల మధ్య ఫోన్ కాల్స్ ను కూడా స్విచ్ చేసుకోవచ్చని అంటున్నారు. అంటే ఒక ఫోన్ లో మాట్లాడుతున్న కాల్ ను మరో ఫోన్ లేదా ట్యాబ్ లేదా ల్యాప్ ట్యాప్ కు ట్రాన్స్ ఫర్ చేయొచ్చు.
- ఒకే జీమెయిల్ అకౌంట్ తో లింక్ అయి ఉన్న ఆండ్రాయిడ్ డివైజ్ ల మధ్య “ఇంటర్నెట్ షేరింగ్” ఆప్షన్ కూడా వస్తుందని అంటున్నారు. దీనివల్ల హాట్స్పాట్ సెటప్ ప్రక్రియ మరింత ఈజీగా మారుతుందని చెబుతున్నారు.