Sundar Pichai : సుందర్ పిచాయ్ పొద్దున్నే చూసే వెబ్‌సైట్ ఇదే.. విశేషాలివీ

Sundar Pichai : భారత ముద్దుబిడ్డ సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్‌కు సీఈఓ‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 11:33 AM IST

Sundar Pichai : భారత ముద్దుబిడ్డ సుందర్ పిచాయ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ గూగుల్‌కు సీఈఓ‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఆయన జీవన శైలిపై ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన ఏం తింటారు ? ఏం చదువుతారు ? దినచర్య ఏమిటి ? సక్సెస్ సీక్రెట్ ఏమిటి ? అనే అంశాలను తెలుసుకునేందుకు చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఈ తరుణంలో పిచాయ్(Sundar Pichai) దినచర్యతో ముడిపడిన ఒక కీలక విషయం తాజాగా వెలుగుచూసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

ప్రపంచంలోని సక్సెస్ ఫుల్ పర్సన్స్‌లో సుందర్ పిచాయ్ ఒకరు. దీనిపై ఎవరికీ ఎలాంటి డౌటూ అక్కర్లేదు. సంపాదన విషయంలో సుందర్ అంత రేంజుకు చేరారంటే ఆయన ట్యాలెంట్, డెడికేషనే కారణం. అలాంటి సుందర్ పిచాయ్ రోజూ పొద్దున్నే లేవగానే ఏ న్యూస్ పేపరో, పుస్తకమో చదువుతారని అందరూ భావిస్తుంటారు.  ఈ అంచనాలకు స్వయంగా సుందర్ పిచాయ్ చెక్ పెట్టారు. తాను రోజు ఉదయాన్నే లేవగానే ఒక టెక్ న్యూస్ వెబ్‌సైట్ చూస్తానని వెల్లడించారు. ఆ టెక్ న్యూస్ వెబ్‌సైట్‌లో వచ్చే వార్తలను చదువుతానని ఆయన తెలిపారు. ఇప్పటికీ తనకు ఆ వెబ్‌సైట్ అంటే ఎంతో ఇష్టమన్నారు. ఇంతకీ ఆ వెబ్ సైట్ ఏది ? అనుకుంటున్నారు. దాని పేరు.. టెక్‌మీమ్ (Techmeme) !! ఈ వెబ్‌సైట్‌ను ఫాలో అవుతామని గతంలో చెప్పిన ప్రముఖుల లిస్టులో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి కూడా ఉన్నారు.

టెక్‌మీమ్ వెబ్‌సైట్ ప్రత్యేకతలు ఇవీ.. 

  • టెక్‌మీమ్‌ను 2005లో గేబ్ రివేరా స్థాపించారు.
  • ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో జరుగుతున్న తాజా సమాచారాన్ని హెడ్‌లైన్స్ రూపంలో ఒక దగ్గరకు చేర్చి అందించడమే టెక్‌‌మీమ్ వెబ్ సైట్ ప్రత్యేకత.
  • టెక్ ప్రపంచంలోని అప్‌డేట్స్ సారాంశాలు, అసలు కథనాల లింక్స్ సేకరిస్తుంది.
  • సమాచారానికి ఉన్న ప్రాముఖ్యతను బట్టి వాటిని వరుస క్రమంలో ఉంచుతుంది.
  • పరిశ్రమలో దాని వినియోగంతో ఉన్న వివరాల్ని అందిస్తుంది.
  • ఇలా పరిశ్రమలో చోటు చేసుకుంటున్న అభివృద్ధిని రోజూ సమగ్రంగా మన ముందు ఉంచుతుంది.
  • టెక్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి వెబ్‌సైట్ అని చెప్పొచ్చు.

Also Read : Pakistan Election: పాకిస్థాన్‌లో ఏం జరుగుతోంది..? గెలిచిన సీట్లను వదులుకున్న రెండు పార్టీలు..!