Site icon HashtagU Telugu

Google Bard india Launched : ఇండియాలో రిలీజైన “గూగుల్ బార్డ్”.. వాడటం ఇలా

Google Bard India Launched

Google Bard India Launched

ChatGPTకి పోటీగా గూగుల్ తన AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)  చాట్‌బాట్ Google Bard (గూగుల్ బార్డ్) ను ప్రారంభించింది. Google I / O 2023 ఈవెంట్ సందర్భంగా ఈవిషయాన్ని ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు అమెరికా, బ్రిటన్ నెటిజన్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్.. ఇప్పుడు  మన ఇండియా సహా మొత్తం 180 దేశాల్లో రిలీజ్ (Google Bard india Launched) అయింది.  ఇంగ్లిష్,  హిందీ సహా మొత్తం 40 భాషలలో దీన్ని వాడొచ్చు.  ప్రస్తుతానికి తెలుగులో(Google Bard india Launched) దీన్ని వాడలేం. వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా భవిష్యత్తులో Google Bardను సపోర్ట్ చేసే భాషల సంఖ్యను  పెంచే ఛాన్స్ ఉంది. గూగుల్ బార్డ్ లోకి వెళ్లి ఇక మీరు వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా సెర్చ్ చేసి  టెక్స్ట్ రిజల్ట్స్, విజువల్ రిజల్ట్స్ ను పొందొచ్చు. ఉదాహరణకు.. మీరు గోవా టూర్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు అనుకుందాం. గోవాలో సందర్శించాల్సిన స్థలాలను చెప్పమని బార్డ్‌ని వాయిస్ లేదా టెక్స్ట్ ద్వారా అడగండి. ఆ వెంటనే మీకు టెక్స్ట్ , విజువల్ రిజల్ట్స్ ను Google Bard చూపిస్తుంది. Google Bard  ఇప్పుడు Gmail, Google docs, Google mapsలతోనూ సింక్ అయి ఉండి పనిచేస్తుంది. అంటే.. ఈ యాప్‌ లలోనూ మీరు బార్డ్‌ని ఉపయోగించవచ్చు.

also read : Google Pixel 7A: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే?

Google Bardని ఎలా ఉపయోగించాలి ?

చాలామంది Google bardని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇది చాలా ఈజీ.  మీరు https://bard.google.comకి వెళ్లి మీ జీమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది . మీరు లాగిన్ అయ్యి ఈ లింక్‌కి వెళ్ళిన వెంటనే స్క్రీన్‌పై “try” అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దీన్ని నొక్కి .. ఆ తర్వాత “agree” ఆప్షన్ ను క్లిక్  చేయాలి. దీంతో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. Google బార్డ్‌ AI చాట్‌బాట్‌ని మీరు  ఉపయోగించగలుగుతారు.

also read : Geoffrey Hinton: గూగుల్ కు రాజీనామా చేసిన జెఫ్రీ హింటన్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి వెల్లడి..!

Google Bardలో ఎలా పనిచేస్తుంది ?

గూగుల్ తన సెర్చ్ ఇంజన్ కోసం ఎన్నో సాఫ్ట్ వేర్ ల్యాంగ్వేజ్ లు డెవలప్ చేసింది. వాటిలోనే ఒక దాని పేరు LaMDA. ఇప్పుడు Google bard  AI చాట్‌బాట్‌ LaMDA ల్యాంగ్వేజ్ లోనే పనిచేస్తోంది. LaMDA భాషతో సింక్ అయ్యేలా నిర్మించిన  Google bard  ట్రాన్స్‌ఫార్మర్స్ అనే న్యూరల్ నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్‌ ఆధారంగా Google bard సెర్చ్ క్వెరీస్ ను తీసుకుంటుంది.  ఇది టెక్స్ట్ సెర్చ్ యొక్క అతి పెద్ద డేటాసెట్‌లోని నమూనాలను ఈజీగా గుర్తించగలదు. దాని గత అనుభవం నుంచి నేర్చుకుంటూ కొత్త అవుట్‌పుట్‌ను రీ ప్రొడ్యూస్ చేస్తుంది. మనం చేసుకునే సంభాషణలను సెర్చ్ బాక్స్ లో టైప్ చేసినా Google bard  రెస్పాండ్ అవుతుంది. ఈ దిశగా దానికి ట్రైనింగ్ ఇచ్చారు.వాక్యనిర్మాణం, టెక్స్ట్, ప్రశ్నలోని పదాలు, పదబంధాల మధ్య సంబంధాలను తెలుసుకుంటూ సెర్చ్ క్వెరీస్ కు వేగంగా ఆన్సర్ ఇవ్వడం Google bard  స్పెషాలిటీ.