Gmail : 2024 ఆగస్టులో జీమెయిల్ బంద్ ? నిజమేనా ?

Gmail : జీమెయిల్.. నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న మెసేజింగ్ టూల్.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 09:32 AM IST

Gmail : జీమెయిల్.. నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న మెసేజింగ్ టూల్. వారంతా రోజులో ఒక్కసారైనా జీమెయిల్‌‌ను ఓపెన్ చేస్తుంటారు. పెద్దపెద్ద కంపెనీలు కూడా  అంతర్గత వ్యవహారాల  మెసేజింగ్  కోసం  గూగుల్ ఈమెయిల్ ప్లాట్‌ఫారమ్‌పైనే ఎక్కువగా ఆధార పడుతుంటాయి. ఫ్రీలాన్సర్‌లు కూడా తమ వృత్తిపరమైన కమ్యూనికేషన్‌ల కోసం జీమెయిల్‌ను ఉపయోగిస్తుంటారు. జీమెయిల్ సర్వీసును గూగుల్ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించిందంటూ గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.  జీమెయిల్ (Gmail) సర్వీసులను ఈ ఏడాది ఆగస్టులో ఆపేస్తారనే తప్పుడు ప్రచారం జరుగుతోంది.  దీంతో జీమెయిల్ యూజర్లు గందరగోళానికి గురవుతున్నారు. జీమెయిల్ సర్వీసు అధికారికంగా నిలిచిపోనుందని పేర్కొంటూ వైరల్ అయిన ఫొటోలో నిజం లేదని, ఇది పూర్తిగా ఫేక్ ఫొటో అని గూగుల్ తేల్చేసింది. సాధారణ జీమెయిల్ యూజర్ అయితే చింతించాల్సిన పని లేదని పేర్కొంది. ఈమేరకు ఒక వివరణను గూగుల్ విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఇందులో కొంత మాత్రమే నిజం ఉంది. జీమెయిల్ యూజర్లు భయపడాల్సిన అవసరం లేదు’’ అని ట్విట్టర్ వేదికగా గూగుల్ వెల్లడించింది. జీమెయిల్ సర్వీసుల్లో ఒక ఫీచర్ మాత్రమే పనిచేయడం ఆపేస్తుందని తెలిపింది.  2024 ఆగస్టు నుంచి  జీమెయిల్‌లోని HTML వ్యూ ఫీచర్ మాత్రమే వర్క్ చేయదని స్పష్టం చేసింది. వాస్తవానికి ఈవివరాలను గత ఏడాది సెప్టెంబరులోనే గూగుల్  కంపెనీ ధృవీకరించింది. 2024 జనవరి తర్వాత జీమెయిల్ యాక్సెస్ చేయడానికి వినియోగదా రులందరికీ డీఫాల్ట్ మోడ్ HTML వ్యూ నుంచి స్టాండర్డ్ వ్యూకు మారుతుందని గతేడాది సెప్టెంబరులోనే గూగుల్ సపోర్టు పేజీలో వెల్లడించారు.

HTML వ్యూ ఫీచర్ ప్రత్యేకత.. 

వాస్తవానికి  HTML వ్యూలో ఈమెయిల్‌లను సాధ్యమైనంత సులభంగా చెక్ చేయొచ్చు. యూజర్లకు తక్కువ ఇంటర్నెట్ నెట్‌వర్క్ ప్రాంతాల్లో ఉన్నప్పుడు స్టాండర్డ్ వ్యూ లోడ్ కానప్పుడు.. హెచ్‌టీఎంఎల్ వ్యూను ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. చాట్, స్పెల్ చెకర్, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు, రిచ్ ఫార్మాటింగ్, సెర్చ్ ఫిల్టర్‌ల వంటి అనేక గూగుల్ ఫీచర్‌లు HTML వ్యూలో అందుబాటులో లేవు. రానున్న రోజుల్లో  తక్కువ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న జోన్‌లలో నివసించే యూజర్ల కోసం మరో కొత్త మోడ్‌ను గూగుల్ రిలీజ్ చేస్తుందా ? లేదా ? అనేది వేచి చూడాలి.

Also Read :Tirumala Today : తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఇవాళ 12 గంటల వరకే ఆ ఛాన్స్