Site icon HashtagU Telugu

Violence Against Women : భార్యను కొట్టడం సరైనదే.. మూడోవంతు పురుషుల ఒపీనియన్

Violence Against Women

Violence Against Women

Violence Against Women : భార్యపై చేయి చేసుకోసుకోవడం సరైనదా ? కాదా ? అనే దానిపై ఒక సర్వే జరిగింది. 

అందులో ఆశ్చర్యకరమైన రిజల్ట్ వచ్చింది.. 

చాలామంది పురుషులు ఎవరూ ఊహించని ఆన్సర్స్ ఇచ్చారు.

మూడోవంతు పురుషులు తమ భార్యపై చేయి చేసుకోసుకోవడం సరైనదే అని చెప్పారంటూ జర్మనీ దేశానికి చెందిన ఓ వార్తా పత్రిక షాకింగ్ సర్వే రిపోర్ట్ ను పబ్లిష్ చేసింది. దాని ప్రకారం.. 18-35 ఏళ్ల వయస్సు గల పురుషుల్లో 33% మంది తమ మహిళా భాగస్వామిపై అప్పుడప్పుడు ‘చేయి చేసుకుంటే’ తప్పేమీ కాదని అన్నారు. తమ భార్యతో గతంలో హింసాత్మకంగా ప్రవర్తించామని 34% మంది జర్మన్ పురుషులు అంగీకరించారు.

Also read :  Mumbai: మహిళను ముక్కలుగా నరికేసి, ఉడకబెట్టిన కేసులో మరో సంచలనం.. సరస్వతిని నేను చంపలేదు..!

జర్మనీలో మార్చి 9-21 తేదీల్లో నిర్వహించిన ఈ ఆన్ లైన్ సర్వేలో భాగంగా 18-35 ఏళ్ల వయస్సు గల పురుషులు, మహిళలను ప్రశ్నించారు. కుటుంబానికి ఆర్థికంగా పురుషులు అండగా నిలవాలని, మహిళలు ఇంటి నిర్వహణ చూసుకోవాలని 52% మంది అభిప్రాయపడ్డారు. స్వలింగ సంపర్కం చేయడం, చూడటం పట్ల 48% మంది అయిష్టత వ్యక్తం చేశారు.

Also read : Pak New Terrorism : మహిళలు, పిల్లలను తాడుకు కట్టి ఆయుధాల సప్లై

జర్మనీ పోలీసుల డేటా ప్రకారం.. 2021లో 1,15,000 మంది మహిళలను వారి భర్తలు హింసకు(Violence Against Women) గురిచేశారు. అంటే.. ప్రతి గంటకు 13 మంది మహిళలు గృహ హింస బాధితులే. 301 మంది మహిళలు భాగస్వామి చేతిలో హత్యకు కూడా గురయ్యారు. మహిళలపై గృహ హింసకు పాల్పడే వారికి మరింత కఠిన శిక్షలు విధించేలా చట్టంలో మార్పులకు ప్రయత్నిస్తానని జర్మనీ న్యాయ శాఖ మంత్రి మార్కో బుష్ మాన్ చెప్పారు.