Pak New Terrorism : కశ్మీర్ లో టెర్రరిజం పెంచేందుకు పాకిస్తాన్ కొత్త ప్లాన్ అమలు చేస్తోంది..
ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు కలిసి దీనికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నాయి..
అదేమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..
కశ్మీర్ లోయను ఉగ్రవాదం ఊబిలోకి నెట్టేందుకు పాక్ కొత్త స్కెచ్(Pak New Terrorism) గీసింది. మహిళలు, బాలికలు, పిల్లలను ఓ తాడుకు కట్టి ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, సమాచారాన్ని లోయలోకి జారవిడుస్తున్నారు. సంప్రదాయ కమ్యూనికేషన్ మార్గాలను భారత సైన్యం నిర్వీర్యం చేస్తున్నందున ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారని భారత సైనికాధికారులు తెలిపారు. నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) వద్ద ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ కశ్మీర్ లో శాంతియుత వాతావరణానికి భంగం కలిగించే పనిలో పాక్ ఉందని శ్రీనగర్ కు చెందిన 15 కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అధికారి ఒకరు చెప్పారు.
Also read : Indigo: పాకిస్తాన్ కు వెళ్లిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం.. ఎందుకో తెలుసా?
మొబైల్ కమ్యూనికేషన్ ను వాడితే పట్టుబడతామన్న భయంతో ఉగ్రవాదులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, ఇలాంటి ఉగ్ర చర్యలను అడ్డుకునేందుకు ‘సహీ రాస్తా’ అనే పథకం ద్వారా మహిళలు, చిన్నారులను ఉగ్రవాద కార్యకలాపాల నుంచి విముక్తి కల్పిస్తున్నామని కమాండింగ్ అధికారి తెలిపారు.