Cannabis Plants : ఇళ్లలో గంజాయి మొక్కల పెంపకం.. చట్టానికి ఆమోదం

Cannabis Plants : గంజాయి సాగు, వినియోగానికి మన దేశంలో కఠిన శిక్షలు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - February 25, 2024 / 10:10 AM IST

Cannabis Plants : గంజాయి సాగు, వినియోగానికి మన దేశంలో కఠిన శిక్షలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క మొక్క పెంచినా నేరమే. పోలీసులు అరెస్టు చేస్తారు. అయితే జర్మనీ పార్లమెంటు గంజాయి వాడకానికి తలుపులు తెరిచేలా ఒక కొత్త చట్టాన్ని చేసింది. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఇంట్లో గరిష్ఠంగా 3 గంజాయి మొక్కలను పెంచుకోవచ్చు. రోజుకు 25 గ్రాముల వరకు గంజాయిని తినొచ్చు. ఈమేరకు ప్రతిపాదనలతో కూడిన బిల్లుకు జర్మనీ పార్లమెంట్ గత శుక్రవారం ఆమోదం తెలిపింది. ఈ చట్టానికి ప్రతిపక్ష పార్టీల నుంచి వ్యతిరేకత  ఎదురైనప్పటికీ..  ప్రధాని ఓలాఫ్ స్కోల్జ్‌కు చెందిన అధికార పార్టీ సభ్యుల మద్దతుతో ఆమోదం పొందింది. గంజాయిని(Cannabis Plants) తీసుకెళ్లేందుకు కమిటీని నియమిస్తామని జర్మనీ ప్రభుత్వం తెలిపింది. ఆ కమిటీ అనుమతించిన సభ్యులు మాత్రమే చట్టబద్ధంగా గంజాయిని తినొచ్చు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల జర్మనీ యువతలో గంజాయి వినియోగం పెరిగింది. దీంతో బ్లాక్ మార్కెట్‌లో గంజాయి విక్రయాలు పెరిగాయి. గంజాయి విక్రయాలకు చట్టబద్ధత కల్పిస్తేనే.. బ్లాక్ మార్కెట్‌లో దాని విక్రయాలకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావించింది.  అందుకే ఆ దిశగా చట్టం చేసింది. అయితే ఈ చట్టంపై జర్మనీ దేశంలోని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మాల్టా, లక్సెంబర్గ్ తర్వాత గంజాయి వాడకాన్ని చట్టబద్ధం చేసిన మూడో దేశంగా జర్మనీ నిలిచింది.  దీనిపై జర్మనీలోని వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.  మరో ఐరోపా దేశం నెదర్లాండ్స్ కూడా గంజాయిని చట్టబద్ధం చేసేందుకు రెడీ కావడం గమనార్హం.

Also Read : Jayalalithaa : ఏఐతో జయలలిత ఆడియో సందేశం.. ఏముందో తెలుసా ?

హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. అనంత కుమార్ బారిక్ అనే ఒడిశాకు చెందిన బాలానగర్ ప్రాంతంలోని ఘరక్ కంటా ప్రాంతంలో తన చిన్న కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్ లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలానగర్ SOT పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా షాపును తనఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్ లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీట్ కింద డిక్కీ లో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.