Site icon HashtagU Telugu

Wife-Husband-92 Rapes : భార్యకు మత్తుమందు ఇచ్చి.. 51 మందితో రేప్ చేయించిన దుర్మార్గుడు

Wife Husband 51 Rapes

Wife Husband 51 Rapes

Wife-Husband-92 Rapes : ఓ వ్యక్తి పవిత్రమైన వివాహ బంధాన్ని కూడా వ్యాపారంగా మార్చాడు..    

తన భార్యకు రోజూ రాత్రి మత్తుమందు ఇచ్చి పరాయి మగవాళ్ళను ఇంటికి ఆహ్వానించేవాడు.. 

ఇలా గత పదేళ్లలో 51 మంది అపరిచితులు వచ్చి మత్తులో నిద్రపోతున్న ఆమెపై 92 సార్లు రేప్ చేశారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది..

దీనికి సంబంధించిన వీడియో టేప్ లు కూడా దొరికాయి..    

రేప్ చేసిన వారిలో 33 మందికి ఇప్పటికే  జైలుశిక్ష పడగా..  మిగితా వారిపై విచారణ కొనసాగుతోంది.

అతడి పేరు డొమినిక్ (dominique p).. వయసు  68 సంవత్సరాలు..  డొమినిక్  ఫ్రాన్స్‌లోని మజాన్ పట్టణవాసి. అతడి భార్య వయసు 61 సంవత్సరాలు.. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.. డొమినిక్ ఆలోచన గాడి తప్పింది. “ఎ సన్ ఇన్సు”(a son insu) అనే ఆన్‌లైన్ ఫోరమ్ అతడి ఆలోచనలను తప్పుదోవ పట్టించింది. టార్గెట్ గా ఎంచుకున్న వారికి  మత్తు మందు ఇచ్చాక.. స్పృహ లేని స్థితిలో రేప్ లు  చేసి ఆనందాన్ని పొందాలనే దానిపై “ఎ సన్ ఇన్సు”  ఆన్‌లైన్ ఫోరమ్ లో డిస్కషన్ జరిగేది. ఇందులో డొమినిక్  కూడా పాల్గొనేవాడు.  ఈ ఫోరమ్ లోని వారికి డొమినిక్ బాగా దగ్గరయ్యాడు.  ఇదంతా 2010 సంవత్సరం నాటి  ముచ్చట!!

2010 సంవత్సరం నుంచే .. 

అప్పటి నుంచే  డొమినిక్ రోజూ రాత్రి తన భార్యకు భోజనంలో ఓ డ్రగ్ కలిపి ఇచ్చేవాడు. ఆమె డిన్నర్ చేశాక మత్తులోకి జారుకొని నిద్రపోయేది. ఆ తర్వాత  “ఎ సన్ ఇన్సు”  ఆన్‌లైన్ ఫోరమ్ ద్వారా తనకు పరిచయమైన వాళ్ళను డొమినిక్(Wife-Husband-92 Rapes) తన ఇంటికి పిలిచేవాడు. రేప్ సీన్ లను చిత్రికరించేందుకు తన బెడ్ రూమ్ లో హిడెన్ కెమెరాలను డొమినిక్ ఫిక్స్ చేశాడని పోలీసులు గుర్తించారు. తన భార్య మత్తు వీడకుండా ఉండేందుకు .. బెడ్ రూమ్ లో స్మోక్ చేయకూడదని, పెర్ఫ్యూమ్‌లను వాడొద్దని రేప్ చేయడానికి వచ్చే వాళ్లకు డొమినిక్ చెప్పేవాడు. ఆకస్మికంగా టెంపరేచర్ మారకూడదనే ఉద్దేశంతో.. వేడి నీటిలో చేతులు కడుకున్న తర్వాతే ఆ అపరిచిత వ్యక్తులను తన భార్య దగ్గరికి పంపేవాడు. ఆ వ్యక్తులు ఇంటి  వంటగదిలో బట్టలు విప్పి .. వేడి నీటిలో చేతులు కడుకున్న తర్వాత బెడ్ రూమ్ లోకి వెళ్లేవారని పోలీస్ ఇంటరాగేషన్ లో తేలింది.

Also read : Submersible Vs Submarine : సబ్‌ మెర్సిబుల్, సబ్ మెరైన్ మధ్య తేడాలు ఇవీ

ఇరుగుపొరుగు వారికి డౌట్ రాకుండా..

ఇరుగుపొరుగు వారికి డౌట్ రాకుండా ఉండేందుకు.. ఈ రేపిస్టులు డొమినిక్ ఇంటికి కొంత దూరంలో ఉన్న స్కూల్ దగ్గర కార్లను పార్క్ చేసి, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేవారు. వాళ్లకు ఈ ఐడియా ఇచ్చింది కూడా డొమినికే అని పోలీసులు చెప్పారు. ఈ రేప్స్ చేసిన వారంతా 24 నుంచి 71 ఏళ్ళ మధ్య వారని చెప్పారు. వీరిలో అగ్నిమాపక సిబ్బంది, లారీ డ్రైవర్, మునిసిపల్ కౌన్సిలర్, బ్యాంక్ ఉద్యోగి, ఐటీ ఉద్యోగి, జైలు గార్డు, మేల్  నర్సు,  జర్నలిస్ట్ ఉన్నారు.

51 మంది 92 సార్లు..

దాదాపు 10 ఏళ్లపాటు (2010 నుంచి 2020 వరకు) ఈ తతంగం కొనసాగింది. డొమినిక్ సహకారంతో అతడి భార్యపై 51 మంది 92 సార్లు రేప్ చేశారని ఫ్రాన్స్ మీడియాలో కథనాలు వచ్చాయి. హిడెన్ కెమెరా ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను యూఎస్బీ(USB) డ్రైవ్ లో ABUSES అనే ఫైల్ నేమ్ తో డొమినిక్ సేవ్ చేశాడని తేలింది. ఈ USB డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డొమినిక్ కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గత ఏడాది (2022) సెప్టెంబరులో ఒక సూపర్‌ మార్కెట్‌లో మహిళల అప్ స్కర్ట్ ఫోటోలు తీసేందుకు డొమినిక్ యత్నించాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి.. ఇంటరాగేట్ చేయగా తన భార్యకు చేసిన ద్రోహం, మోసం, అమానుషం గురించి చెప్పాడు. ఈనేపథ్యంలో డొమినిక్ కు అతడి భార్య వెంటనే విడాకులు ఇచ్చింది.