Site icon HashtagU Telugu

Fattest Woman-Baby Elephants : 3 ఏనుగు పిల్లలకు సమానమైన బరువు తగ్గింది.. ఎవరు.. ఎలా ?

Fattest Woman Baby Elephants

Fattest Woman Baby Elephants

Fattest Woman-Baby Elephants : ఆమె పేరు కత్రినా రాయ్ ఫర్డ్ (Catrina Raiford).. 

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాకు చెందిన కత్రినా వయసు 47 ఏళ్ళు..

ఆమె బరువు 433 కేజీలు.. హైట్ 5 అడుగుల 2 అంగుళాలు..  

ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళగా గుర్తింపు పొందింది..  

ఇదంతా పాత ముచ్చట.. 

ఇప్పుడు కత్రినా బరువు 133 కిలోలకు తగ్గిపోయింది. 

ఒకప్పుడు సోషల్ మీడియా ప్రొఫైల్ లో కూడా తన ఫోటో పెట్టుకోవడానికి ఇష్టపడేది కాదు..

కానీ ఇప్పుడు తన ఫోటోనే  ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకుంటోంది. 

ఇంతకీ దాదాపు 3 ఏనుగు పిల్లలతో సమానమైన బరువును కత్రినా రాయ్ ఫర్డ్ ఎలా తగ్గించుకోగలిగింది ?  

14 సంవత్సరాల వయస్సులోనే కత్రినా రాయ్ ఫర్డ్  బరువు 230 కిలోలు ఉండేది. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె బరువు పెరగసాగింది. 20 ఏళ్ళు దాటిన తర్వాత ఆమెకు జాబ్ వచ్చింది. అయితే జాబ్ లో జాయిన్ అయిన కొన్ని నెలలకే అధిక బరువును కారణంగా చూపించి కంపెనీ ఆమెను జాబ్ నుంచి తీసేసింది.  అప్పటి నుంచి కత్రినా ఇంటి దగ్గరే ఉండసాగింది. ఎటువంటి శారీరక శ్రమ కూడా లేకపోవడంతో ఆమె బరువు ఇంకా పెరిగింది.

Also read : Jahnvi Kapoor : ఓపెన్ క్లివేజ్ షో తో మతి పోగొడుతున్న శ్రీదేవి కూతురు

అవమానం నుంచి కసి.. 

2003 డిసెంబరు లో శ్వాస తీసుకోవడంలో  కత్రినా  ఇబ్బంది పడింది. లేచి కనీసం నడవలేక పోయింది. దీంతో ఆమెను ఇంటి నుంచి బయటకు తీయడానికి.. తలుపు పక్కనున్న గోడను కూల్చాల్సి వచ్చింది. ఆమె బాడీ సైజు అంతగా పెరిగిపోయింది. క్రేన్ ను తీసుకొచ్చి ఆమెను లేపి.. ట్రక్కు వెనుక ఓపెన్ ప్లేస్ లో పడుకోబెట్టి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. హాస్పిటల్ లో కూడా నాలుగు బెడ్స్ ను జాయింట్ చేస్తే కానీ కత్రినా కోసం కంఫర్టబుల్ బెడ్ రెడీ కాలేదు. “ఈ అన్నింటిని చూసిన తర్వాత నాలో కసి రగిలింది. ఆ సంఘటనలను నేను అవమానంగా ఫీల్ అయ్యాను..  ఎలాగైనా బరువు తగ్గాలని ఆ రోజే డిసైడ్  అయ్యాను” అని ఆమె చెప్పింది. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన వెయిట్ లాస్ జర్నీని వివరించింది.

Also read : AP Politics: ఏపీలో కుక్క, కోడి రాజకీయం…

2017 సంవత్సరం నుంచి మొదలు.. 

“2005లో గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేసుకున్నాక  నా బరువు తగ్గిపోయి 230 కిలోలకు చేరింది. “2017 సంవత్సరం నుంచి నేను తేలికపాటి  జిమ్ చేయడం మొదలు పెట్టాను.. వాటర్ ఏరోబిక్స్ చేశాను. క్యాలరీ ఇన్ టేక్ ను తగ్గించే ఫుడ్ ను తీసుకున్నాను.. ఇవన్నీ చేయడం వల్ల నా బరువు ఇప్పుడు 133 కిలోలకు చేరింది” అని  కత్రినా వివరించారు. “నాకు స్కిన్ రిమూవల్ సర్జరీ ఇంకొకటి జరగాల్సి ఉంది. దానికి రూ.42 లక్షలు అవసరం. అందుకోసం దాతల సాయం కోరుతున్నాను” అని పేర్కొంది.

ఒక ఏనుగు పిల్ల బరువు 100 కిలోలకు పైనే ఉంటుంది.  మొత్తానికి కత్రినా 300 కిలోల శరీర బరువును తగ్గించుకోవడం గమనార్హం. 300 కిలోలు అనేది 3 ఏనుగు పిల్లల బరువుకు(Fattest Woman-Baby Elephants)  సమానం.