Passphrases : ఫుల్ సెక్యూరిటీ కావాలా ? ‘పాస్​వర్డ్’ బదులు ‘పాస్​ఫ్రేజ్’ వాడండి!

పాస్‌వర్డ్ గురించి మనకు తెలుసు. వివిధ ఆన్‌లైన్ లాగిన్‌ అవసరాల కోసం మనమంతా పాస్‌వర్డ్‌లపైనే ఆధారపడుతున్నాం.

  • Written By:
  • Updated On - May 22, 2024 / 10:18 AM IST

Passphrases :  పాస్‌వర్డ్ గురించి మనకు తెలుసు. వివిధ ఆన్‌లైన్ లాగిన్‌ అవసరాల కోసం మనమంతా పాస్‌వర్డ్‌లపైనే ఆధారపడుతున్నాం. ఆన్​లైన్​ బ్యాంకింగ్, సోషల్ మీడియా అకౌంట్లకు కూడా వాటినే వాడుతున్నాం. పాస్‌వర్డ్‌లను మించిన సెక్యూరిటీని అందించే ఒక మార్గం అందుబాటులో ఉంది. అదే ‘పాస్​ఫ్రేజ్​’ (Passphrases)!! దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

‘పాస్​ఫ్రేజ్​’ ఏమిటి ? ఎలా క్రియేట్ చేయాలి ?

  • ‘ఫ్రేజ్’ అంటే పదబందం అని అర్థం. ఇది కొన్ని పదాల కలయిక.
  • ఒక ఎగ్జాంపుల్‌ను పరిశీలిస్తే.. thats not a big deal అనే ఫ్రేజ్ ఉంది. పాస్ ఫ్రేజ్ తయారీలో భాగంగా మనం దీన్ని లెటర్స్, నంబర్స్​, స్పెషల్ క్యారెక్టర్స్​లోకి మార్చేయాలి. దీనివల్ల thats not a big deal అనే ఫ్రేజ్  2081#TON127deaL అనే ఫార్మాట్‌లోకి మారిపోతుంది. దీన్నే leetspeak అని పిలుస్తారు. ఇలా క్రియేట్ చేసిన పాస్​ఫ్రేజ్​లో not అనే పదాన్ని TON అని మార్చారు. దీనివల్ల హ్యాకర్ మీ ఫ్రేజ్‌ను కనిపెట్టినా.. దాన్ని క్రాక్ చేయడం చాలా కష్టతరంగా మారుతుంది.
  • పాస్ ఫ్రేజ్‌ను సెట్ చేసుకునేటప్పుడు.. మీకు ఈజీగా గుర్తుండే ఫ్రేజ్‌నే ఎంపిక చేసుకోవాలి.
  • కొన్ని వైబ్​సైట్లు పొడవాటి పాస్​వర్డ్​లను సపోర్ట్ చేయవు. అలాంటప్పుడు ఫ్రేజ్‌లోని మొదటి అక్షరాలను తీసుకుని, వాటితో పాస్​ఫ్రేజ్‌ను క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ కంప్యూటర్​లో మనం ఎంత పొడవాటి పాస్​ఫ్రేజ్​ను అయినా టైప్ చేయొచ్చు. కానీ మొబైల్ ఫోన్స్​, ట్యాబ్స్​లో వాటికి సపోర్ట్ లభించకపోవచ్చు.
  • మీరు పాస్​వర్డ్ మేనేజర్​ను వాడుకోవడం బెటర్. దీనికి మీరు ఒక మాస్టర్​ పాస్​వర్డ్​ను పెట్టుకుంటే చాలు. అది మీ అన్ని పాస్​వర్డ్​లను సురక్షితంగా ఉంచుతుంది.

Also Read : Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు

  • ప్రస్తుతం పాస్​కీ ఆథెంటికేషన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అందరూ పాస్ వర్డ్‌లపైనే ఆధారపడుతున్నారు.
  • కొంతమంది సింపుల్​గా ఉండే పాస్​వర్డ్‌లు పెట్టి హ్యాకర్లకు దొరికిపోతుంటారు.  సైబర్​ నేరగాళ్ల ‘డిక్షనరీ ఎటాక్స్’ సింపుల్‌గా ఉండే పాస్‌వర్డ్‌లను ఇట్టే కనిపెట్టేస్తాయ్.
  • మరికొందరు స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను వాడినా.. అన్ని అకౌంట్లలోకీ అదే ఉపయోగిస్తుంటారు. ఒకవేళ ఫిషింగ్ సైట్లలో మీ పాస్​వర్డ్ ఎంటర్ చేయగానే, దానిని సైబర్ విలన్స్ ఈజీగా కనిపెట్టేస్తారు.
  • ఒకవేళ ప్రతి అకౌంట్​కు వేర్వేరు స్ట్రాంగ్ పాస్​వర్డ్స్​ పెట్టుకుంటే, వాటిని గుర్తుంచుకోవడం కష్టమైపోతుంది.