Bear Meat : ఉడకని ఎలుగుబంటి మాంసం.. తిన్నాక ఏమైందంటే..

ఎలుకలు, పంది కొక్కులు, కోతులను కూడా చైనా వాళ్లు అవలీలగా తినేస్తుంటారు.

  • Written By:
  • Updated On - May 25, 2024 / 05:01 PM IST

Bear Meat : ఎలుకలు, పంది కొక్కులు, కోతులను కూడా చైనా వాళ్లు అవలీలగా తినేస్తుంటారు. అమెరికాలోని కొన్ని ఆటవిక తెగల వాళ్లు దీనికి అతీతమేం కాదు. వాళ్లు కూడా ఏ జంతువును పడితే దాన్ని తినేస్తారు. ఈక్రమంలోనే అమెరికాకు చెందిన ఒక కుటుంబం సౌత్ డకోటా ప్రాంతానికి వెళ్లినప్పుడు ఎలుగుబంటి మాంసంతో తయారు చేసిన కబాబ్‌లను లొట్టలేస్తూ తిన్నారు. అక్కడి వరకు అంతా సాఫీగానే ఉంది. ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. కొన్ని గంటల తర్వాత ఎలుగుబంటి మటన్ తిన్న వాళ్లకు వాంతులు, విరేచనాల ఎపిసోడ్ మొదలైంది. దీంతో వెంటనే బాధితులను హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు.

We’re now on WhatsApp. Click to Join

ఉడకని ఎలుగుబంటి మటన్(Bear Meat) తినడం వల్ల బాధిత కుటుంబంలోని 29 ఏళ్ల యువకుడి  మెదడుకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు గుర్తించారు. సాధారణంగా అడవి జంతువులను తినడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్ వస్తుంటుందని తెలిపారు. బాధిత కుటుంబంలోని మరో ముగ్గురు కూడా ఇదే ప్రాబ్లమ్‌తో తదుపరిగా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వారికి అల్బెండజోల్‌తో చికిత్స అందించారు. ఈ ట్రీట్మెంట్‌తో ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు. సరిగ్గా ఉడకని మాంసం తింటే జీర్ణ సమస్యలు వస్తాయని తెలిపారు. 2022 సంవత్సరంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలతో ఒక అధ్యయన నివేదిక అమెరికాకు చెందిన  సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి)లో తాజాగా పబ్లిష్ అయింది. ఉడకని ఎలుగుబంటి మటన్ తినడం వల్ల బాధితుల్లో జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పులు, కళ్ల చుట్టూ వాపు వంటి లక్షణాలు బయటపడ్డాయని నివేదికలో ప్రస్తావించారు. వారి మెదళ్లకు వచ్చిన సమస్యను ట్రైకినెలోసిస్ అంటారని వెల్లడించారు. ఇదొక అరుదైన బ్రెయిన్ వార్మ్ ఇన్‌ఫెక్షన్ అని తెలిపారు.

Also Read : Kartikeya Gummakonda : సల్మాన్ ఖాన్‌కి విలన్‌గా కార్తికేయ నటించబోతున్నాడా..?